NewsOrbit
న్యూస్ హెల్త్

రుచి, వాస‌న తెలియడం లేదా? అయితే వెంటనే ఈ పని చెయ్యండి!

గ‌తేడాది చివ‌రిలో వెలుగు చూసిన క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు విస్త‌రించి.. త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటూనే ఉంది. ఇప్ప‌టికే ఆర్థిక‌, ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 13 ల‌క్ష‌ల‌కు పైగా మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఆరు కోట్ల మందికి పైగా ప్ర‌జ‌లను అనారోగ్యానికి గురిచేసింది. ఇంకా త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటున్న క‌రోనా వైర‌స్.. వికృత రూపం దాలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే కోవిడ్‌-19తో పాటు, వైరస్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు సైంటిస్టులు. దానిలో భాగంగా వారు నిర్వహించిన పరిశోధనలో ఇప్ప‌టికే ప‌లు ఆస‌క్తిక‌ర‌, ఆందోళ‌నక‌ర విష‌యాలు వెలుగుచూశాయి. తాజాగా ప‌లువురు సైంటిస్టుల జ‌రిపిన త‌మ అధ్య‌య‌నంలో క‌రోనా ల‌క్ష‌ణాల‌ను మ‌రింత విస్తృతంగా వివ‌రించారు. ఇప్ప‌టికే జ్వ‌రం, అగ‌కుండా ద‌గ్గు రావ‌డం, చలిగా ఉండటం, తరచూ వణికడం, ఒళ్లు నొప్పులు వంటివి క‌రోనా ల‌క్ష‌ణాలుగా వైద్యులు వెల్ల‌డించారు.

అయితే, “మెడంటా కోవిడ్–19” పేరుతో నిర్వ‌హించిన ఓ అధ్య‌య‌నం.. రుచిని కోల్పోవ‌డం, వాస‌ను గుర్తించ‌క‌పోవ‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణాలేన‌ని తెలిపింది. అలాగే, గ్యాస్ట్రిక్ ట్ర‌బుల్ కూడా క‌రోనా సోకింద‌న‌డానికి రుజువు అని ఈ అధ్య‌య‌నం విరించింది. ఈ ప‌రిశోధ‌న‌కు నోయిడాకు చెందిన ఇంటర్‌‌‌‌వెన్షనల్‌‌ పల్మనాలజిస్ట్‌‌ అరుణ్‌‌ లఖన్‌‌పాల్ నాయ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న ఈ అధ్య‌య‌న వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ.. వాస‌న‌, రుచిల‌ను గుర్తించ‌క‌పోవ‌డం (కోల్పోవ‌డం) కూడా క‌రోనా ల‌క్ష‌ణాలే అని అన్నారు.

ఈ ల‌క్ష‌ణాలు క‌రోనా ఎటాక్ చేసిన రెండో వారంలో క‌నిపిస్తాయ‌ని అరుణ్ తెలిపారు. భార‌త వైద్య నిపుణులు సైతం ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. 40 శాతం పేషేంట్ల‌లో ఇది వంద శాతం నిజ‌మ‌వుతోంద‌ని తెలిపారు. అయితే, వాస‌న‌, రుచిని గ్ర‌హించే శ‌క్తి తిరిగి రావ‌డానికి మూడు నుంచి నాలుగు వారాల సమ‌యం ప‌డుతుంద‌ని వెల్ల‌డించారు. అయితే, ఎక్కువ శాతం వాస‌న‌, రుచి కోల్పోతున్న వారిలో యువ‌తే ఉన్నార‌నీ, ఎక్కువ ప్ర‌మాదం లేక‌పోవ‌డంతో వీరికి ఆక్సిజ‌న్ స‌పోర్టు అవ‌స‌రం లేద‌ని అన్నారు. అయితే, బ‌య‌ట తిర‌గ‌కుండా స్వీయ‌నిర్భంధంలో ఉండ‌టం మంచిద‌ని సూచించారు.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N