న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీలపై నమ్మకం పోయింది!

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది కపిల్ సిబాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అగస్టా వ్యవహారంలో ఈడీ సీబీఐ కోర్టుకు చెప్పిన విషయాలన్నీ మోడీ సూచనలు, ఆదేశాల మేరకేనని ఆయన ఆరోపించారు. ఈడీ, సీబీఐలకు ప్రాతినిథ్యం వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు బయట క్రిస్టియాన్ మిఛెల్ వెల్లడించాడంటూ మాట్లాడిన మాటలు మోడీ ఆదేశాల మేరకేనని ఆరోపించారు. లేకపోతే క్రిస్టియన్ మిఛెల్ ఇటాలియన్ మహిళ కుమారుడి పేరు వెల్లడించారని ఆయన ఎలా చెబుతారని నిలదీశారు. మోడీ హయాంలో దర్యాప్తు సంస్థలన్నీ ఆయన కనుసన్నలలో, చెప్పు చేతల్లో నడుస్తున్నాయనీ ఆరోపించారు. తమకు ఈడీ, సీబీఐలపై నమ్మగా పోయిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులపైకి మోడీ ఉసిగొల్పుతున్నారని దుయ్యబట్టారు.