ఏ జాబ్ చేసినా ఒకరికింద పని చేయాల్సిందే.. అది ఎప్పటికీ బానిసత్వమే.. కానీ అదే బిజినెస్ చేస్తే.. మనమే కొందరికి ఎంప్లాయిమెంట్ ఇవ్వొచ్చు.. అది స్వాతంత్య్రం. మనకు నచ్చినట్లు ఉండొచ్చు. మన ఆర్డర్లనే మనదగ్గర పని చేసేవారు వింటారు. అయితే ఇలాంటి ఆలోచన ఎప్పటి నుంచో మీకు ఉందా..? కానీ ఎలా స్టార్ట్ చేయాలి ? ఏ బిజినెస్ చేయాలి ? అనే ప్రశ్నలు మీకున్నాయా..? వాటిని పరిష్కరించే సమాధానాలు ఇప్పుడు చూడండి.
ఫుడ్ బిజినెస్ కు ఉన్న డిమాండ్ ఈ రోజుల్లో మరే బిజినెస్ కు లేదు. ఈ బిజినెస్ తో ఆన్లైన్ లో కూడా డెలివరీ చేయొచ్చు. కరోనా తర్వాత ఆన్లైన్ డెలివరీలు మళ్లీ పుంజుకున్న విషయం తెలిసిందే. అందుకే మీరు గాని రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు పొందొచ్చు. పెట్టుబడి పెట్టిన రోజునుంచే లాభాలు పొందొచ్చు. మిగతా బిజినెస్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే.. ఎప్పుడో లాభాలను చవి చూడాల్సి వస్తుంది. కానీ ఫూడ్ బిజినెస్ ను స్టార్ట్ చేస్తే మాత్రం రెస్టారెంట్ ఓపెన్ చేసిన రోజునుంచే లాభాలను చూడొచ్చు.
అందుకే మీకు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే రెస్టారెంట్ బిజినెస్ మంచిదని చెప్పొచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మీరు నాన్ వెజ్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? లేక వెజ్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా..? లేక ఈ రెండు దొరికే రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా అనే అంశాలపై స్పష్టత ఉండాలి. అలాగే ఫాస్ట్ఫుడ్, ఇతర వెరైటీస్ ఏం చేయాలో తెలిసి ఉండాలి.
రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటే రద్దీ ఉండే ప్లేస్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మంచి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే రూ.7 నుంచి రూ.12 లక్షల ఖర్చు అవుతుంది. మీకే సొంత ల్యాండ్ ఉంటే ఇందులో సగం కూడా ఖర్చు కాదు. లేక రెంట్ తీసుకోవాలనుకుంటే 700 నుంచి 1500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్ఠలాన్ని తీసుకోవాలి.
అందులో అన్ని సెట్ చేస్తూనే.. మందు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, తర్వాత హెల్త్ లైసెన్స్ తీసుకోవాలి.తర్వాత ఆ రెస్టారెంట్ గురించి మార్కెటింగ్ చేసుకోవాలి. అలాగే చేసే వంటలు బాగుండాలి. క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు. తర్వాత ఆన్లైన్ డెలివరీ సర్వీసులు ప్రారంభించాలి. అప్పుడు మీ బిజినెస్ కు డోకా ఉండదు.