NewsOrbit
న్యూస్

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Love Guru OTT: బిచ్చగాడు 2 బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన మూవీ లవ్ గురు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీను స్వయంగా విజయ్ ఆంటోనీ ప్రొడ్యూస్ చేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. లవ్ గురు మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మే మూడవ తారీకు నుంచి ఆహా ఓటీటిలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. తమిళంలో ఈ మూవీ రోమియో పేరుతో రీమేక్ అయింది. తమిళ్ వర్షన్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తెలుగులో ఆహా ఓటిటి, తమిళంలో అమెజాన్ ప్రైమ్ లో మే 3న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.

Love Guru OTT updates
Love Guru OTT updates

ఏప్రియల్ లాస్ట్ వీక్ లవ్ గురు ఓటిటి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెల్లుడయ్యే అవకాశం ఉంది. లవ్ గురు మూవీ లో మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. హీరోగా విజయ్ ఆంటోనీ ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ కథనాలతోనే సినిమాలు చేశాడు. వాటికి భిన్నంగా పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీ గా లవ్ గురు రూపొందింది. నటుడిగా మాత్రం విజయ్ ఆంటోనీ ఈ మూవీలో కొత్తగా కనిపించాడు. కానీ స్టోరీ రొటీన్ కావడంతో ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అరవింద్ (విజయ్ ఆంటోని) ఓ బిజినెస్ మాన్. కుటుంబ సభ్యుల కారణంగా ప్రేమ మరియు పెళ్లి ఇలాంటి బంధాలకు దూరంగా ఉంటాడు.

35 వయసు దాటిన తరువాత లీల (మృణాళిని) అనే అమ్మాయితో అరవింద్ పెళ్లి జరుగుతుంది. తల్లిదండ్రుల బలవంతం తోనే అరవింద్ ను పెళ్లి చేసుకుంటుంది లీల. హీరోయిన్ కావాలన్నది లీల కోరిక కోరిక తెలుసుకుంటాడు. లీలా మనసును గెలవడంతో పాటు ఆమె కోరిక తీర్చడం కోసం తానే హీరోగా.. నిర్మాతగా మారి అరవింద్ ఓ సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అరవింద సినిమా తీయగలిగాడా? దానికి ఆమె భార్య ఒప్పుకుందా? అనే కథాంశాలు చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. లవ్ గురు మూవీ లో యోగిబాబు, వీటివీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. భరత్ ధన్ శేఖర్ మ్యూజిక్ అందించాడు.

Love Guru OTT updates
Love Guru OTT updates

తమిళ్లో విజయ్ ఆంటోని మూవీస్ అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ప్రతి ఒక్కరులోనూ ఉంటుంది. కానీ ఈసారి దానిని నిలబెట్టుకోలేకపోయాడు విజయ్ ఆంటోని. ఇక ఈ మూవీ ఓటిటిలో అయినా సూపర్ హిట్ అయితే తన ఫ్యాన్స్ ఖుషి అవుతారని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీడీలో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఈ మూవీ కూడా ఓటీపీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటే విజయ్ ఆంటోనీ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతారని చెప్పుకోవచ్చు. విజయ్ ఆంటోనీపై తాము పెట్టుకున్న నమ్మకాలకు న్యాయం చేసినట్లు అవుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N