Love story : లవ్ స్టోరి పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అంటే మామూలు విషయం కాదు..!

Share

Love story : లవ్ స్టోరి.. అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించగా ఈ నెల 16న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. మజిలీ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న సినిమా ఇదే కావడం.. అలాగే శేఖర్ కమ్ముల – సాయి పల్లవి కాంబినేషన్ ఫిదా తర్వాత మళ్ళీ ఈ సినిమాతో రిపీటవుతుండటం లవ్ స్టోరి సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు పెంచేసింది. ఇక సారంగ దరియా సాంగ్ లో సాయి పల్లవి డాన్స్ అలాగే ఇటీవల మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన ఏవో ఏవో కలలే సాంగ్ సినిమా మీద అంచనాలు మరింతగా పెంచాయి.

love-story-is-going-to-released-in-pan-indian-range
love-story-is-going-to-released-in-pan-indian-range

ఇటీవలే యూట్యూబ్ లో సారంగ దరియా అత్యంత వేగంగా వ్యూస్ సాధించిన పాటగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క సాంగ్ జనాలను థియోటర్స్ కి రప్పిస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాని వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ – అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ – పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి వారం రోజులు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవుతున్న లవ్ స్టోరి మీద ఎలాంటి ప్రభావం చూపదని అంటున్నారు.

Love story : మిగతా భాషల్లో ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందో..?

అయితే తాజాగా ఈ సినిమాని బహుభాషా చిత్రంగా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. అంటే ఒకరకంగా పాన్ ఇండియన్ సినిమా రేంజ్ లో అనమాట. తెలుగు కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారట. ఇన్నాళ్ళు ఈ సినిమా కేవలం తెలుగులోనే రాబోతోందని అందరు అనుకున్నారు. కానీ సినిమా మీద ఏర్పడిన అంచనాలతో మేకర్స్ మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారట. చూడాలి మరి ఈ సినిమా మిగతా భాషల్లో ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందో.


Share

Related posts

కుప్పంలో కూడా కుంపటి పెట్టిన వైసిపి!బాబుకు ఇంక నిద్రలేని రాత్రులేనా!

Yandamuri

ర‌జ‌నీ మొద‌టి దెబ్బ ప‌డేది వీరికే… బీజేపీ గేమ్ అదే?

sridhar

క‌ల నేర‌వేరింది…

Siva Prasad