Love Story review: లవ్ స్టోరీ మూవీ రివ్యూ

Share

Love Story review: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పవన్ సి.హెచ్ మ్యూజిక్ అందించాడు. నారాయణదాస్ కే నారంగ్, పుష్కర రామ్మోహన్  నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…Love Story (2021) - IMDb

కథ

రేవంత్ (నాగచైతన్య) ఒక జుంబా డాన్స్ సెంటర్ నడుపుతుంటాడు. అతనికి బీటెక్ చదివి ఉద్యోగం కోసం కష్టపడుతున్న మౌనిక (సాయిపల్లవి) పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య నిదానంగా ప్రేమ చిగురిస్తుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకూ తీసుకునివెళ్ళాలి అనుకున్నప్పుడు మధ్యలో కులం అనే ఒక అడ్డంకి వస్తుంది. ఇక్కడ నుండి వారిద్దరి ప్రేమ కథా వ్యవహారం ఎలా నడిచింది? వీరిద్దరూ ఒకటయ్యారా..? లేదా..? అన్నదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్

• చైతన్య, సాయి పల్లవి కెరీర్ లలో ఇవి ద బెస్ట్ పర్ఫార్మెన్స్లు అనే చెప్పాలి. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించి ఆ కథకు ఎంతో న్యాయం చేశారు. వీరిద్దరినీ స్క్రీన్ పైన అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

• ఈ సినిమాకు మరొక పెద్ద బలం పాటలు. ఆల్బమ్ హిట్ అయింది, అందరికీ నచ్చింది కానీ తెరపైన వాటిని ఇంకా ఎంతో అందంగా చిత్రీకరించారు. ఇక మొదటి సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ పవన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఆకట్టుకున్నాడు.

• సామాజిక అంశాలపై దృష్టి పెట్టిన భాగం మొత్తం సినిమాలో ఎంతో బాగుంది. మన చుట్టూ సమాజంలో జరుగుతున్న వివక్ష గురించి ఎంతో లోతుగా విశ్లేషించి ఈ సినిమా తీశారు కాబట్టి అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

• సినిమాలో అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరిస్తుంది. సామాజిక అంశాలు కథాంశంగా తీసుకున్న సినిమాలో ఎంటర్టైన్మెంట్ నింపడం వల్ల చక్కటి ఫీలింగ్ కలుగుతుంది.

Love Story' Review Live Updates - Telugu News - IndiaGlitz.com

మైనస్ పాయింట్స్

• ఈ సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. మొదటి అర్ధ భాగం, రెండవ భాగంలో మరొక సగభాగం వరకు అసలైన కథాంశం బయటకు రాకపోవడం పెద్ద మైనస్. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఎంతో శ్రద్ధ వహించవలసి ఉంటుంది.

• పైన చెప్పిన ప్రతికూలత వల్ల క్లైమాక్స్ భాగం మొత్తం చాలా తొందరగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఈ భాగాన్ని మాత్రం పొడిగించి ఉంటే ఎంతో బాగుండేది. అలా చివరి భాగం, క్లైమాక్స్ అంతా తొందరగా అయిపోవడం వల్ల ప్రేక్షకులకు సినిమాపై నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది.

Naga Chaitanya to play a middle-class man in Sekhar Kammula's Love Story | Telugu Movie News - Times of India

విశ్లేషణ

సామాజిక అంశాలు ప్రధాన పాత్ర పోషించిన ఒక ప్రేమకథా చిత్రాల్ని సంతృప్తికరంగా చూపించడంలో శేఖర్ కమ్ముల ఈ సారి విఫలమయ్యాడు. సాధారణంగా తన సినిమాలలో ప్రేమ కథ ఎంతో అర్థవంతంగా… బాగుంటుంది. అయితే అటు సామాజిక అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి లవ్ స్టోరీలో తోతు కూడా మిస్ అయినట్టే అనిపిస్తుంది. కానీ లీడ్ జంట పర్ఫార్మెన్స్ అయితే అద్భుతం. ఇప్పటికీ సమాజంలో కొనసాగుతున్న వివక్ష చూపించడం కూడా బాగుంది. ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు కూడా సినిమాకి ఊపిరిపోశాయి. ఇక ఈ వారాంతం కుటుంబం మొత్తం వెళ్లి సినిమాని ఒకసారి చూసి రావచ్చు.

 

చివరి మాట: లవ్ స్టొరీ సాగింది… కానీ మనసూ లాగింది


Share

Related posts

కేసీఆర్ కి షాక్..! హ్యాండిచ్చిన జగన్..? సర్వం మోడీ మయం..!!

Srinivas Manem

YS Viveka Murder Case: వివేకా కేసులో కోర్టు ముందుకు రెండో వ్యక్తి ..! కోర్టు హాలులో సెన్షేషనల్ కామెంట్లు..?

Srinivas Manem

Bigg Boss 5 Telugu: డిస్కవరీ ఛానల్ లో.. ఉండాల్సింది అనవసరంగా హౌస్ లోకి తెచ్చారు.. జనాలు సీరియస్ ..!!

sekhar