Love story : ‘లవ్ స్టోరీ’కి ఆ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లేనట..త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ..!

Share

Love story : ‘లవ్ స్టోరీ’.. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ. ఆయన సరసన ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటించింది. నాగ చైతన్య – సాయి పల్లవిలది ఫ్రెష్ కాంబినేషన్.. అద్భుతమైన ప్రేమకథ. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కరోనా కారణంగా గత ఏడాది ఆరంభం నుండి లవ్ స్టోరీ సినిమా పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. వాస్తవంగా, గత ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.

love-story-release-date-officially-to-be-announced
love-story-release-date-officially-to-be-announced

 

చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడే కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా వేయక తప్పలేదు. దాంతో ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేసేందుకు మళ్లీ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అయితే మళ్లీ సెకండ్ వేవ్ కారణంగా ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ మళ్లీ పోస్ట్‌పోన్ అయింది. దాంతో లవ్ స్టోరీ సినిమా ఈ ఏడాదిలో విడుదల అవుతుందా లేదా.. అది కూడా థియేటర్స్‌లోనా, లేక ఇంత మంచి సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు స్పందించాల్సి వచ్చింది.

Love story : లవ్ స్టోరి మూవీ సెప్టెంబర్ 10వ తేదీన విడుదల..?

ఎటువంటి పరిస్థితుల్లోనూ లవ్ స్టోరి సినిమాను థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేశాకే విడుదల చేస్తామని మరోసారి అధికారకంగా ప్రకటించారు. కాగా గత నెల నుండే మళ్ళీ పరిస్థితులు సద్దుమణిగి థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కాని ప్రేక్షకులు వచ్చే విషయంలో  సస్పెన్స్ కొనసాగింది. మొదటి వారం అందరూ ఆశించినంతగా జనాలు థియేటర్స్‌కి రాలేదు. అయితే తరువాత వారం నుండి మంచి వసూళ్లను కొత్త సినిమాలు రాబట్టడం విశేషం. దాంతో మేకర్స్‌కి నమ్మకం పెరిగింది. అందుకే వరుసగా సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లవ్ స్టోరి మూవీని సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారు.


Share

Related posts

Horoscope : Today Horoscope జనవరి -28-  ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు

Mahesh

Ys Jagan : జగన్ పథకాన్ని కాపీ కొట్టిన ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..!!

sekhar