Lovers: 11 ఏళ్లుగా ప్రేమికుల రహస్య కాపురం..! ఒకే గదిలో.. అదే ఇంట్లో.. ఫ్యామిలీకి తెలీకుండా

lovers 11 years love story
Share

Lovers: ప్రేమికులు Lovers ఒక్కడు సినిమాలో భూమికను మహేశ్ తల్లిదండ్రులు, చెల్లెలికి తెలీకుండా తన ఇంట్లో దాచేస్తాడు. అచ్చంగా అలాంటి ఘటనే ఇప్పుడు కేరళలో జరగడం సంచలనం రేపుతోంది. ప్రియుడి కోసం ఇంటి వచ్చేసిన ప్రియురాలు.. అతనుంటున్న చిన్న ఇంట్లోనే ఓ గదిలో ఏకంగా పదకొండేళ్లు ఉండిపోయింది. ఈ విషయం అరకిలోమీటరు దూరంలో ఉంటున్న తన కుటుంబానికే కాదు.. అదే ఇంట్లోనే ఉంటున్న యువకుడి తల్లిదండ్రులు, సోదరికి తెలీకపోవడం అమితాశ్చర్యం కలిగిస్తోంది. సినిమాను తలపించే ఈ ప్రేమకథకు కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని అయిలూర్ గ్రామం వేదికైంది. వివరాల్లోకి వెళ్తే..

lovers 11 years love story
lovers 11 years love story

రెహమాన్(24), సాజిత(18) ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని సాజిత ప్రియుడి వద్దకు వచ్చేసింది. ఏంచేయాలో తెలీక అతని ఇంట్లోనే అతని గదిలో ఉంచాడు. అదే.. ఆమెకీ ఇష్టమైంది. 2010లో జరిగిందీ సంఘటన. అప్పటినుంచి ఇప్పటికీ ఆమె ప్రపంచం ఆ చిన్నగదే. ఆసక్తిరేపే అంశం.. ఆ గదిలో సాజిత ఉంటున్నట్టు ఆ ఇంట్లోనే ఉంటున్న కుటుంబానికి ఈ 11 ఏళ్లలో తెలీకపోవడం. రెహమాన్ ఎలక్ట్రీషియన కావడంతో తలుపుకు ప్రత్యేక గడియ పెట్టాడు. దాంతో ఎవరూ ఆ గదిలోకి వెళ్లలేదు. ఆమెకు తానే ఆహారం తీసుకెళ్లేవాడు.

Read More: Movie Release: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు..!!

ఆమె కాలకృత్యాలన్నీ ఇంటి బయట బాత్ రూమ్ లో అదీ.. రాత్రి వేళల్లో మాత్రమే. సులువుగా వచ్చేందుకు చెక్కలతో కిటికీని ఏర్పాటు చేశాడు. ఆమెకోసం గదిలో టీవీ ఉంచి హెడ్ ఫోన్లు ఇచ్చాడు. అదే ఆమె ప్రపంచం. ఇంట్లోవారు బయటకు వెళ్తే మాత్రం గది బయటకు వచ్చేది. ఇంట్లో ఏమైనా వండినా.. గదిలోకి వెళ్లి చెరి సగం తినేవారు. ఇన్నేళ్లలో జరిగింది ఇదే. సాజిత కనిపించట్లేదని 2010లోనే ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టినా.. ఇన్నేళ్లలో ఆమె ఆచూకీ లభించలేదు. కరోనా పరిస్థితుల్లో సంపాదన ఆగిపోవడంతో అక్కడ ఉండటం కష్టమని.. వితనస్సరీ అనే గ్రామంలో కాపురం పెట్టారు.

 

దీంతో రెహమాన్ కనిపించడం లేదని సోదరుడు కేసు పెట్టాడు. ఈక్రమంలో నెన్మారా అనే గ్రామంలో రెహమాన్ కనిపించడంతో సోదరుడు పోలీసులకు తెలిపాడు. దీంతో వీరి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. విచారణలో ఒక్కో విషయం చెప్తూంటే ఎవరికీ నోట మాట రాలేదు. పోలీసులు వీరిపై కేసులు కొట్టేశారు. ఇన్నేళ్లలో తనకే కష్టం రాకుండా చూసుకున్నాడని సాజిత.. కుటుంబం నామీదే ఆధారపడటంతో ఇలా చేశాను. ఇక మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని రెహమాన్ అంటున్నారు.


Share

Related posts

మద్యపానం ఆరోగ్యానికి ఉపయోగకరం అంటున్న డాక్టర్లు!!  కారణం ఇదే!!

siddhu

సీనియర్ ఎన్‌టి‌ఆర్ రూట్ లో జగన్ మోహన్ రెడ్డి .. – చంద్రబాబు ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోవాల్సిందే !

sekhar

Salaar Movie: “సలార్” లో ప్రభాస్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో తెలుసా? బాహుబలి ఏం పనికొస్తుంది దీని ముందు?

sekhar