Low BP: లోబీపీతో ఇబ్బందిపడుతున్నారా..? డోంట్ ఫియర్..! ఈ ఆయుర్వేద టిప్స్ ట్రై చేయండి…!!

Low BP heath tips
Share

Low BP: చాలా మంది హైబీపీ, లో బీపీతో బాధపడుతుంటారు. హైబీపీ ఉంటే డాక్టర్ ల వద్దకు వెళ్లి మందులు రాయించుకుని వాడుతూ ఉంటారు. అయితే లో బీపీ సమస్యతో బాధపడుతున్న వాళ్లు మందులు ఏమి వాడకుండా ఉంటుంటారు. తమకు బీపీ లేదుకా అని నెగ్లెట్ చేస్తుంటారు. కానీ లో బీపీ సమస్య ఉంటే అశ్రద్ద పనికి రాదు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. లేకుంటే లోబీపీ సమస్య పరిష్కారానికి ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. అవి పాటించినా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. లోబీపీ సమస్య ఉన్న వాళ్లలో బ్రెయిన్, ఊపిరితిత్తులు, కిడ్నీ తదితర శరీర భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని వల్ల వారు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. కావున వీళ్లు ఈ సమస్యను తేలిగ్గా వదిలివేయకుండా జాగ్రత్తలు పాటించడం ఆరోగ్యానికి మంచిది.

Low BP heath tips
Low BP heath tips

Low BP: ఆయుర్వేద చిట్కాలు ఇవీ

లోబీపీతో బాధపడే వాళ్లు అల్లం ముక్కలు చేసుకుని అందులో నిమ్మరసం, కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఒక జార్లో పెట్టుకుని రోజుకు మూడు నుండి నాలుగు సార్లు తీసుకుంటే మంచిది. దీని వల్ల కొద్ది రోజుల్లోనే లోబీపీ సమస్య కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. అంతే కాకుండా నల్ల మిరయాలు, టమాటా రసం కలిపి తీసుకుంటే కూడా లో బీపీ సమస్య నుండి బయటపడవచ్చు. బీట్ రూట్ కూడా ఎక్కువగా తీసుకుంటే లోబీపీ సమస్య తగ్గుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను రోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. అదే విధంగా పాలల్లో ఖర్జూరం వేసి మరిగించి తీసుకుంటే కూడా లోబీపీ నుండి బయటపడవచ్చు. ఈ సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల లోబీపీ సమస్యను నివారించుకోవచ్చు.


Share

Related posts

Bigg Boss 5 Telugu: వార్ వన్ సైడ్ అంటూ ఆ కంటెస్టెంట్ కి ఫుల్ సపోర్ట్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్..!!

sekhar

కిడ్నీ ల విషయం లో చాలా తేలికగా జాగ్రత్త తీసుకోవచ్చు ఇలా  !

Kumar

Covaxine: ఆ 4 కోట్లు డోసులు ఏమయ్యాయి..!? కోవక్జిన్ లో తప్పుతున్న లెక్క..!?

Srinivas Manem