NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

LPG Price Hike: గ్యాస్ వినియోగదారులకు మరో సారి షాక్ ..కానీ కాస్త ఊరట..! ఎందుకంటే..?

LPG Price Hike: గ్యాస్ వినియోగదారులపై మరో సారి భారం పడింది. సామాన్యులకు మరో సారి షాక్ ఇస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పిజీ గ్యాస్ సిలెండర్ ధరలను పెంచాయి. అయితే ఈ సారి కాస్త ఊరట ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు రెండు పర్యాయాలు గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలెండర్ పై రూ.50ల వంతున పెంచగా ఈ సారి సిలెండర్ పై కేవలం రూ.3.50లు మాత్రమే పెంచడం కొంత ఊరట. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదులతో పేద, మథ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేటి నుండి డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరపై రూ.3.50 లు పెంచగా కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పై రూ.8లు పెంచాయి. పెరిగిన ధరలతో ఈ రోజు నుండి ఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలెండర్ ధర రూ.1003లు చేరుకుంది. ఇక ముంబాయిలో రూ.1002.50, కోల్‌కతాలో రూ.1029లు, చెన్నైలో రూ.1018.50లు,  హైదరాబాద్ లో రూ.1055లు, విజయవాడలో 1,031లకు చేరింది. అనంతపురం జిల్లాలో ఏకంగా రూ.1070లకు చేరింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సిలెండర్ ధర రూ.1100లకు చేరింది.

LPG Price Hike again
LPG Price Hike again

LPG Price Hike: రెండు నెలల్లో మూడవ సారి

దేశంలో గుజరాత్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరగడం ఈ నెలలో రెండవ సారి. గత నెలలో గృహ వినియోగ ఎల్పీజీ సిలెండర్ పై రూ.50లు పెరిగిన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన డొమెస్టిక్ ఎల్ పీ జీ సిలెండర్ ధరలను రూ.50లు పెంచాయి. తాజా పెరుగుదలతో రెండు నెలల కాలంలో మూడవ సారి ధరలను పెంచాయి. అయితే ఇంతకు ముందు రెండు సార్లు రూ.50ల మేర పెంచిన కంపెనీలు ఈ సారి కేవలం రూ.3.50లు మాత్రమే భారం వేయడం కొంత ఊరట ఇచ్చే అంశంగా ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju