Lucifer : చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తన అప్ కమింగ్ మూవీ లూసిఫర్.. ఈ సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో మంజు వారియర్ పాత్రలో స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోందని వార్తగానాలు వినిపించాయి.. అయితే నయన ఈ సినిమాలో నటించనని తేల్చి చెప్పేసింది.. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు మరో హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
లూసిఫర్ రీమేక్ లో నటించేందుకు త్రిష సైన్ చేసింది.. మెగాస్టార్ సూపర్ హిట్ స్టాలిన్ సినిమాలో జంటగా నటించింది త్రిష. చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా లీడ్ రోల్ పోషించాల్సిన త్రిష అనూహ్యంగా తప్పుకుంది. ఇప్పుడు నయన లూసిఫర్ తప్పుకోవడంతో త్రిష ఒకే చేసింది.. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకు రానుంది. హీరో అనుచరుడిగా హీరో సత్యదేవ్ అలరించనున్నాడు.