Chiranjeevi : ఆచార్య సినిమా ఇటీవల కంప్లీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసీఫర్ సినిమా తెలుగు రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ముందు సుజీత్ చేతికి ఆ తర్వాత వినాయక్ చేతికి వెళ్ళి ఫైనల్ గా మోహన్ రాజా చేతికి వచ్చింది. ఆయన చిరంజీవి ఇమేజ్ కు అలాగే, మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకుల తగ్గట్లుగా లూసీఫర్ తెలుగు రీమేక్ లో మార్పులు చేర్పులు చేసి పక్కాగా స్క్రిప్ట్ సిద్దం చేశారు.
సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్ర లాంటి వారు ఈ స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొని బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం లూసీఫర్ తెలుగు రీమేక్ షూటింగ్ లో చిరంజీవి ఆగస్టు 12 నుండి సెట్ లోకి ఎంటరవనున్నారట. ఇప్పటికే ఈ మూవీ కోసం సురేష్ సెల్వరాజన్ నేతృత్వంలో భారీ సెట్టింగ్ సిద్దం చేశారు. ఈ సెట్ లోనే సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే దర్శకుడు మోహన్ రాజాకి ఆగస్టు 12 నుండి షూటింగ్ లో జాయిన్ కానున్నట్టు చిరంజీవి చెప్పారని టాక్ వినిపిస్తోంది.
Chiranjeevi : మెగాస్టార్ బర్త్ డేకి మెగా సర్ప్రైజెస్ ఓ రేంజ్లో ఉండనున్నాయని తెలుస్తోంది.
కాగా మెగా కాంపౌండ్ నుండి అభిమానులకి సర్ప్రైజింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. ఆగస్టు 12 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి రెండు వారాల్లో కొంత టాకీపార్ట్ కంప్లీట్ చేసి మెగాస్టార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఫస్ట్ లుక్ ను రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాలలోనూ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే తర్వాత సినిమాలను కూడా అప్డేట్ ఇవ్వనున్నట్టు తాజా సమాచారం. మొత్తానికి మెగాస్టార్ బర్త్ డేకి మెగా సర్ప్రైజెస్ ఓ రేంజ్లో ఉండనున్నాయని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?