MAA: టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అధ్యక్ష పదవి కోసం హడావిడి స్టార్ట్ అయింది. ఇప్పటికే తెరపైకి ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు పోటీ పడుతున్నట్లు అధికారికంగా ప్రకటించడం తో.. తెలుగు చిత్ర పరిశ్రమలో “మా” ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ సపోర్ట్ ఫుల్ గా ఉన్నట్లు.. వార్తలు వస్తూ ఉండగా మరో పక్క మంచు విష్ణు గెలుపు కోసం.. మోహన్ బాబు.. తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు. మంచు విష్ణు అభ్యర్థిత్వాన్ని గెలిపించడం కోసం మోహన్ బాబు.. ఇండస్ట్రీలో ప్రముఖుల సపోర్ట్ కోరుతూ క్యాంపెయిన్ చేస్తున్నారు.
ఇక ఇదే రీతిలో ప్రకాష్ రాజ్ కూడా రంగంలోకి దిగి ఇండస్ట్రీలో ఉన్న వారి మద్దతు కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పేరు ఇప్పటివరకు మా అధ్యక్ష ఎన్నికల విషయంలో వినపడుతూ ఉండగా తాజాగా మరో కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఆ వ్యక్తి మరెవరో కాదు జీవిత రాజశేఖర్. ఆమె కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అయినట్లు అధికారికంగా ప్రకటించింది.
Read More: Maa: టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలో ఎన్నికలు..??
ప్రస్తుతం మా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జీవిత రాజశేఖర్ .. “మా” అధ్యక్ష పదవికి రెడీ అవటం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్గా మారింది. 2019లో శివాజీ- నరేష్ మధ్య పోటీ నెలకొంది. ఇప్పుడు దాదాపు ముగ్గురి మధ్య “మా” అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడటం ఇండస్ట్రీలో సంచలనం అయింది.