MAA: టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (మా) వాతావరణం వాడి వేడిగా ఉంది. గతంలో ఇద్దరు పోటీదారులు ఉంటే ఇప్పుడు ఏకంగా నలుగురు ఇంకా మరికొంత మంది అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తూ ఉండటం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్నికల బరిలోకి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ వంటి వారు పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం తెలిసిందే.
దీంతో వీరిలో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతం ఉత్కంఠ కరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటికే మెగా కాంపౌండ్ ప్రకాష్ రాజ్ గెలుపు కోసం మద్దతు తెలపగా దగ్గరుండి మెగా బ్రదర్ నాగబాబు క్యాంపెయిన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరోపక్క కొడుకు మంచు విష్ణు గెలుపు కోసం తండ్రి మోహన్ బాబు.. కృష్ణంరాజు అదేరీతిలో సూపర్ స్టార్ కృష్ణ మద్దతు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
Read more: Bala Krishna: సరికొత్తగా ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు..??
ఇక స్టార్ హీరోల లో ఎవరు ఏ కాండిడేట్ కి మద్దతు ఇస్తారు అన్న ది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పరిస్థితి ఇలా ఉండగా నందమూరి బాలయ్య బాబు మద్దతు చాలావరకు జీవితాకు ఉన్నట్లు లేటెస్ట్ టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తోంది. అధికారికంగా బాలయ్య బాబు ముందుకు వచ్చి ఈ ప్రకటన చేస్తూ మరింత బాగుంటుందని.. దీంతో మా అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం మా అధ్యక్ష ఎన్నికలు వలన టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో నాలుగు వర్గాలుగా విడిపోయే అవకాశం ఉందని మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ అధ్యక్ష పదవి స్వీకరిస్తారో అన్నది సస్పెన్స్ గా మారింది.