Maa election: మా ఎలక్షన్లలో మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ ఎందుకు ఓటు వేయలేదో తెలుసా…?!

Share

Maa election: అక్టోబర్ 10 (ఆదివారం)న జరిగిన మా ఎలక్షన్లలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది. 925 ఓట్లలో 880 వరకు సినిమా వారు ఓటింగ్ వేయడానికి అర్హులు కాగా.. వారిలో 665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ స్థాయిలో పోలింగ్ నమోదయినప్పటికీ.. ప్రముఖ టాలీవుడ్ సినీ నటీనటులు ఓటు వేయకపోవడం గమనార్హం. జూ. ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, హన్సిక, సమంత, నాగ చైతన్య, అల్లు అర్జున్, వెంకటేష్, అనుష్క లతో సహా ఇంకా చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేదు. వీరంతా ఎన్నికలకు ఎందుకు దూరం ఉన్నారో ఇంకా తెలియరాలేదు. కానీ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణాలు ఉన్నాయి.

MAA Elections: బండ్ల గణేశ్ మార్క్ ప్రచారం..!!

మహేష్ బాబు అందుకే రాలేదా

మహేష్ బాబు ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఇండియాలో లేకపోవడమే! ప్రస్తుతం మహేష్ బాబు స్విట్జర్లాండ్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం నాడు ఈ హీరో తన పిల్లలైన గౌతమ్, సితారలతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరు స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఫొటో పోస్టుకు స్విస్ డైరీస్ (swissdiaries) అని మహేష్ బాబు ఓ ట్యాగ్ యాడ్ చేశారు. వారం రోజుల క్రితం సర్కారు వారి పాట మూవీ షూటింగ్ నిమిత్తం స్పెయిన్ దేశం వెళ్లిన మహేష్ షూటింగ్ ముగించుకుని.. ఇప్పుడు స్విట్జర్లాండ్ లో కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైం గడుపుతున్నారని తెలుస్తోంది. సుదూర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టే మహేష్ ఈసారి మా ఎలక్షన్లలో ఓటు వేయలేకపోయారు.


MAA Elections: ఉద్రిక్తతల నడుమ ప్రశాంతంగా ‘మా’ ఎన్నికల పోలింగ్..!!

తారక్ రాకపోవడానికి అదే కారణమా

మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జీవితా రాజశేఖర్ కొద్ది రోజుల క్రితం జూ.ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఓటు వేయాలని అభ్యర్థించడానికి జూ.ఎన్టీఆర్ వద్దకు వెళ్తే.. ఎన్నికల పరిస్థితులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ప్రాంతీయ వాదంతో పాటు ఎలక్షన్లలో నిలబడ్డ సభ్యుల మధ్య నేలబారు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తారక్ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని ఆమె తెలిపారు. ఈ కారణంతో పాటు తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు టీవీ షోతో ఆయన తీరిక లేకుండా సమయం గడుపుతున్నారు. ఆయన రాకపోవడానికి ఇవి కూడా కారణాలు కావచ్చు.

Maa Election’s: “మా” ఎలక్షన్స్ నేపథ్యంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి సంచలన కామెంట్స్..!!


Share

Related posts

Pawan Kalyan: పవన్ – రానా సినిమాలో మరో కొత్తదనం ఉండేలా సెన్సేషనల్ డెసిషన్..!!

sekhar

Hyper Aadhi: ఆ డైరెక్టర్ సినిమాలు ఎక్కువ చూస్తాను..ఆయన ఎక్కువగా ప్రభావితం చేస్తారంటున్న హైపర్ ఆది..!!

sekhar

తన జీవితంలో ఎవ్వరికీ చెప్పని నిజాలు బయటపెట్టిన కార్తీకదీపం వంటలక్క…

Naina