MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై గత కొద్ది నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠతన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ తదితర ప్యానల్ లు పోటీ చేస్తాయని తొలుత భావించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో జీవిత రాజశేఖర్.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు చేరిపోవడం జరిగింది. ఈ పరిణామంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి నిర్మాత బండ్ల గణేష్ బయటకు వెళ్లి జీవితకు ప్రత్యర్థిగా ప్రధాన కార్యదర్శి పదవకి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మంచు విష్ణు తన ప్యానల్ ను ప్రకటించారు. తన ప్యానల్ నుండి ఎవరెవరు ఏఏ పదవులకు పోటీ చేస్తున్నారు అనే విషయాలను మంచు విష్ణు వెల్లడించారు.
మంచు విష్ణు – అధ్యక్షుడు
రఘుబాబు – జనరల్ సెక్రటరీ
బాబు మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
మాదాల రవి – వైస్ ప్రెసిడెంట్
ఫృద్విరాజ్ బాలిరెడ్డి – వైస్ ప్రెసిడెంట్
శివ బాలాజీ – కోశాదికారి
కరాటే కళ్యాణి – జాయింట్ సెక్రటరీ
గౌతమ్ రాజు – జాయింట్ సెక్రటరీ
అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాధ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరరెడ్డి, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు. స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల, రేఖ పేర్లను ప్రకటించారు.
కాగా మా ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్యనే పోటీ ఉండనుంది. ఈ సారి మా కు ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నిక అవ్వనున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…
ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…
బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్ అంతటా పెంచేందుకు కరణ్…
ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…
కొందరు హత్యాచారం లాంటి నేరాలు చేసి సాక్షం దొరకకుండా తప్పించుకోవాలని అనుకుంటుంటారు. కానీ ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ పరిశీలన, సాంకేతిక ఆధారాలతో పోలీసులు.. దోషులను పట్టుకుంటారు.…