MAA Elections: ఈ విషయంలో కేసిఆర్ సర్కార్ యమ గ్రేటో..! వాళ్లు థ్యాంక్స్ చెప్పాల్సిందే..!!?

Share

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తీరును తెలుగు రాష్ట్రాల ప్రజలు మీడియాలో ఆసక్తిగానే గమనించారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లు, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ల సెలబ్రిటీలు కావడంతో మీడియాలో హైలెట్ కవరేజ్ అయ్యింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆదివారం మా ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద కోవిడ్ నిబంధనలు పాటించిన దాఖలాలు అసలు లేవు,. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి ఏమీ లేకుండా ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడమే కాదు ఆలింగనాలు, భుజాలపై చేయి వేసి ఫోటోలు దిగడం ఇవి అన్నీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించారు. తమ తమ అభిమాన నటులను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు మా ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద గుమిగూడారు. వందలాది సభ్యులు పోలింగ్ కేంద్రాల వద్ద కలియతిరిగారు. పోలీసు బందోబస్తు గట్టిగానే ఏర్పాటు చేశారు.

MAA Elections polling violation of covid norms
MAA Elections polling violation of covid norms

MAA Elections: కోవిడ్ నిబంధనలు గాలికి వదిలివేశారా..?

కానీ పోలింగ్ కేంద్రం వద్ద కోవిడ్ నిబంధనలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే విధంగా ఏపిలో గానీ జరిగి ఉంటే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వారిపై పోలీసులు నిర్మోహమాటంగా కేసులు నమోదు చేసే వారని పలువురు పేర్కొంటున్నారు. ఏమాటకామాట చెప్పుకోవాలి. ఏపి సర్కార్ కంటే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కాస్త చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఏపిలో మాత్రం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తే రాజకీయ పార్టీ నేతలపైనా కేసులు నమోదు చేయడం చూశాం. వినాయక చవితి వేడుకల సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఏపిలో మాత్రం గణేష్ నవరాత్రి వేడుకలను ప్రభుత్వం నిషేదం విధించింది. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పట్టణాల్లో, గ్రామాల్లో గణేశ్ మండపాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు దసరా వేడుకల సందర్భంగా మళ్లీ అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే ముందస్తుగా ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చేసిింది. అయితే ఈ విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయడమే ఉత్తమంగా పలువురు పేర్కొంటున్నారు.


ఇంకా నమోదు అవుతున్న కరోనా కొత్త కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోలేదు. ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు దేశ వ్యాప్తంగా రోజు లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం వేలల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు రోజు 20వేల వరకూ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ ఇప్పటికీ కోవిడ్ నిబంధనలను పాటించాలని మార్గదర్శకాలను జారీ చేస్తూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది వ్యాక్సిన్ లు వేసుకోని ఉండటంతో ఇక తమకు కరోనా సోకదు అన్న ధీమాతో యదేశ్చగా గతంలో మాదిరి భయం అనేది లేకుండా తిరుగాడుతున్నారు. ఇది ఓ కందుకు మంచిది కాదు. పూర్తి స్థాయిలో కరోనా నిర్మూలన అయ్యే వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాల్సిన అవసరం ఏంతైనా ఉంది.


Share

Related posts

విశాఖ రాజధాని గురించి కీలక విషయం చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

sekhar

చమురు తగ్గినా… పెట్రోల్ పెరిగెను… రహస్యం ఇదే…!!

Srinivas Manem

Instagram: ఇంస్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్..??

sekhar