Maa Elections: విష్ణు గెలవడానికి అసలు సిసలైన కారణం ఇదే..!

Share

Maa Elections: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. తొలి ఫలితంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు విజయం సాధించి ఆశలు రేకెత్తించారు. కానీ తరువాత ఫలితాల్లో విష్ణు ఆధిక్యంలోకి వచ్చారు. ఇక తుది ఫలితాల్లో ఆయనే గెలిచి సంచలనం సృష్టించారు. ఈ రేంజ్ లో జరిగిన మా ఎన్నికల్లో విజయాన్ని ముద్దాడడంతో విష్ణు సంతోషంతో మునిగితేలుతున్నారు. ఇక మోహన్ బాబు సైతం సంబురాలు చేసుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ప్రకాష్ రాజ్ మొదటి నుంచే ఓటమి భయంతో చెమటలు కక్కారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన కొంత సమయం తర్వాత విజయం తన వైపే ఉందని సంతోషించారు. కానీ అతని సంతోషం ఎంతోకాలం నిలువలేదు.


Maa election: మా ఎలక్షన్లలో మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ ఎందుకు ఓటు వేయలేదో తెలుసా…?!

విష్ణు అందుకే గెలిచారా

మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు చాలా దూకుడుగా ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారాలు చేపట్టారు. గెలవడానికి ప్రతి చిన్న విషయాన్ని తాను చాలా తెలివిగా వాడుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి టాలీవుడ్ యాక్టర్స్ ను సైతం హైదరాబాద్ కి రప్పించారు. అతని కారణంగానే ఓటర్లు పెరిగారని ముందుగానే చెప్పుకున్నాం కదా! వారంతా కూడా కళ్లు మూసుకొని విష్ణుకే ఓట్లు గుద్దారు. దీంతో ఎన్నికల పోటీ అనేది వన్ సైడ్ వార్ గా మారిపోయింది. అందుకే విష్ణు ఘన విజయం సాధించారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజు ముందుగానే గ్రహించినట్టు తెలుస్తోంది. భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని విష్ణు కాస్త యాటిట్యూడ్ చూపించారు. తన తండ్రి చాలా గొప్ప అన్నట్లు.. ప్రకాష్ రాజ్ అస్సలు ఎక్కడి నుంచి వచ్చారు? అంటూ అతను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం అందరికీ తెలుసు. దీనితో అతని పైన కాస్త నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. కానీ విష్ణు ఘన విజయం సాధించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. అలాగే చివర్లో ప్రకాష్ రాజ్ పై నాగబాబు వల్ల వ్యతిరేకత వచ్చింది. ఈ రెండు కారణాలతో ప్రకాష్ అపజయం పాలయ్యాయి.


Maa election: మా ఎలక్షన్లలో మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ ఎందుకు ఓటు వేయలేదో తెలుసా…?!
జనరల్‌ సెక్రటరీ ఫలితాలు

మంచు విష్ణు ప్యానల్‌కి చెందిన శివ బాలాజీ ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోని నాగినీడుపై 32 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శివబాలాజీకి 316 ఓట్లు పడ్డాయి. నాగినీడుకి 284 ఓట్లు వచ్చాయి. జనరల్‌ సెక్రటరీ పోటీలో జీవితపై కమెడియన్, సీనియర్ నటుడు రఘుబాబు మొదటి నుంచే పూర్తి ఆధిక్యం కనబర్చారు. చివరికి 7 ఓట్ల ఆధిక్యంతో అతను జీవిత పై గెలిచి వావ్ అనిపించారు. జీవిత ఎన్నికల వ్యవహారం తెరమీదకు వచ్చిన సమయం నుంచి ఎంతో హడావిడి చేశారు. కానీ చివరికి రఘుబాబుపై పరాజయం పాలయ్యారు.


Share

Related posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్ …. ఆట‌లో అరటి పండు అయిపోతున్నారా?

sridhar

Shriya: ఐ యాం బ్యాక్ అంటున్న సీనియర్ హీరోయిన్ శ్రియ..!!

sekhar

కేటీఆర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నేడు

Siva Prasad