MAA: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొద్ది నెలల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఈ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు మాత్రమే పోటీ పడేవారు. కానీ ఈ సారి ఏకంగా ఐదుగురు సభ్యులు పోటీ పడటానికి రెడీ అవ్వడం తో… ఈ సారి “మా” అధ్యక్ష ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో లోకల్ నాన్ లోకల్ అనే వాదన ఎన్నికలలో సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే పోటీ చేస్తున్న వారిలో ఒకరైనా పోటీదారుడు సివిఎల్. నరసింహారావు ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోలు విజయ్ దేవరకొండ, నితిన్ ఇంకా మరికొంత మంది నటీనటులు మద్దతు తెలపగా పోయినా పర్వాలేదు కానీ.. బయటకు వచ్చి తమ అభిప్రాయాన్ని ఎక్కడా కూడా తెలియ చేయకుండా ఉండాలని పేర్కొన్నారు.
Read more: Maa: “మా” అధ్యక్ష ఎన్నికలకు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన ప్రకాష్ రాజ్..!!
ఒకవేళ తనకు మద్దతు బయటకు వచ్చేస్తే కనుక రాబోయే రోజుల్లో వారికి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసే పరిస్థితి వాతావరణం టాలీవుడ్ లో ఉందని పేర్కొన్నారు. కచ్చితంగా తెలంగాణవాదం తెర పైకి తీసుకు రావడం జరుగుతుందని… ఉద్యమ స్ఫూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ తనకు స్ఫూర్తి అని నరసింహారావు స్పష్టం చేశారు. కచ్చితంగా జరగబోయే మా అధ్యక్ష ఎన్నికలలో.. గెలవటం గ్యారెంటీ అని నరసింహారావు పేర్కొన్నారు. తెలంగాణ వాదాన్ని గెలిపించాలని తెలంగాణ ఆట పాట సంస్కృతిని కాపాడాలని దేశవ్యాప్తంగా నలుమూలల నుండి మాత్రమే కాక ఇతర దేశాల నుండి తనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయని నరసింహారావు స్పష్టం చేశారు. మా అధ్యక్షుడిగా గెలిస్తే కచ్చితంగా తనకి కేసీఆర్ ప్రభుత్వం నుండి 200% సపోర్ట్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.