న్యూస్ సినిమా

రవితేజ క్రాక్ నుంచి ” మాస్ బిర్యాయని” అంటూ రిలీజైన మసలా సాంగ్.. ఒక్కరికి పూనకాలొస్తున్నాయిగా ..!

Share

రవితేజ క్రాక్ నుంచి “మాస్ బిర్యాయని” అంటూ మాస్ ఆడియన్స్ ని ఊపేసే మాంచి మసాలా సాంగ్ రిలీజైంది. ఈ మాస్ సాంగ్ raviteaja ఫ్యాన్స్ ని మాత్రమే కాదు ప్రతీ మాస్ ఆడియన్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. చెప్పాలంటే మాస్ మహారాజ రవితేజ నుంచి ఇన్నాళ్ళు ఏమైతే మిస్ అయ్యారో అవన్ని దట్టంగా క్రాక్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని దట్టించినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పటికే raviteaja – gopichand malineni కాంబినేషన్ లో బలుపు, డాన్ శీను సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Ravi Teja, Shruti's Delicious Biryani Song - Gulte

ఇప్పుడు ఆ రెండు సినిమాలకి మించి బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నారు raviteaja – gopichand malineni. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఆర్జీవీ అప్సర రాణి మాస్ రాజాతో మాస్ స్టెప్పులేసింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుండటంతో మేకర్స్ ప్రమోషన్ ని పీక్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా krack సినిమా నుంచి మాస్ బిర్యాని అన్న మాంచి మసాలా సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘భూమ్ బద్దలు’ ‘భలేగా తగిలావే బంగారమ్’ ‘కోరమీసం పోలీసోడు’ సాంగ్స్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. ఈ క్రమంలోనే రీసెంట్ గా krack నుంచి కిరాక్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని ప్రతీ ఒక్కరు ఫిక్సైపోయారు. ఆ నమ్మకాలను తాజాగా రిలీజైన మాస్ బిర్యాని సాంగ్ ఇంకా పెంచేసిందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నుంచి ఖిలాడి అన్న సినిమా రాబోతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

 


Share

Related posts

CM KCR: తెలంగాణ సీఎం కేసిఆర్ తో కోవివుడ్ స్టార్ హీరో విజయ్ భేటీ.. రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్లే(నా)..?  

somaraju sharma

ఏపీ లో కరోనా వీజ్రంబిస్తుందా?

Siva Prasad

ఈ ద‌సరాకు మీ ఇంట్లో విషాదం… జ‌ర‌గ‌కుండా చూడ‌టం మీ చేత‌ల్లోనే!

sridhar