Macrame: Rs.5000, యూట్యూబ్ ఛానెల్ తో నెలకు లక్షలు సంపాదిస్తోంది…! పూజ హస్తకళ అమోఘం

Macrame art
Share

Macrame: అందరిలాగే ఢిల్లీకి చెందిన పూజ కంట్ ఆదర్శవంతమైన ప్రయాణం… ఉద్యోగం వదిలేయడంతోనే మొదలైంది. ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్న తనకు ఒక బిడ్డ జన్మించిన తర్వాత ఉద్యోగం నుండి బ్రేక్ తీసుకుంది. ఇక ఆ సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఒకటైనా కరాల గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నప్పుడు మళ్ళీ ఉద్యోగానికి వెళ్లాలని ఉంది… కానీ ఆ కార్పొరేట్ జీవితానికి వెళ్లలేకపోయింది.

 

Macrame art

ఊర్లో ఆడవాళ్ళ కోసం….

అయితే అదే సమయంలో తన గ్రామం లో ఎంతో మంది ఆడవారు ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారు. కాబట్టి వారు అందరికీ ఉపాధి కల్పించే విధంగా తను బతకాలని నిర్ణయించుకుంది. 43 ఏళ్ల పూజ… ‘పూజా కి పొట్లి’ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ స్థాపించి… అందులో చేతులతో చేసిన ‘మాక్రమె’ ఆర్ట్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. జనపనార (Jute) తో చేయబడిన ఈ ఆర్ట్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. 

ఇక ఇందులో హస్తకళలు కూడా చెక్కతో చేయడం గమనార్హం. ఇలా ఆమె 25 మహిళలను ఉద్యోగులుగా చేర్చుకొని రోజుకు 150 ఆర్డర్లను స్వీకరిస్తూ లక్షలు సంపాదిస్తోంది.

Macrame హస్తకళ లో నైపుణ్యం

‘మాక్రమె’ అనేది అలంకరణ కోసం తన జనపనార ద్వారా ద్వారా మెలివేసి చేసే ఒక హస్త కళ. పూజా ఎప్పుడైతే తన గ్రామంలో వుండే ఆడవారికి సహాయం చేయాలనుకుందో… వెంటనే కళలు, చేతిపనులు నేర్చుకుంది. తను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే… ఆడవారు వీటి ద్వారా ఇంటి దగ్గరే ఉండి ఎంతో వేగంగా తమకు వచ్చిన కలను నేర్చుకోగలరు. యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ఈ కళలను నేర్చుకున్న పూజ అప్పుడు కేవలం కొద్ది కంపెనీలు ఈ హస్తకళలను చేస్తున్నట్లు మార్కెట్లో వాటి ధర ఎంతో అధికంగా ఉన్నట్లు కనుగొంది. 

కాబట్టి ఆమె వివిధ డిజైన్లలో నేర్చుకొని ఇదే చేతి పని, హస్త కళను మామూలు ధరకి అందించాలని భావించింది. ఇది ఆమెకు మంచి హాబీ గా కూడా మారింది. వెంటనే దగ్గరలోని స్టోర్స్ నుండి జనపనార ను సేకరించి ప్రతిరోజూ వాటిని చుట్టేందుకు కొన్ని గంటల సమయం కేటాయించింది. ఇలా వినూత్నమైన డిజైన్లతో ఆమె జనపనారను చుట్టడం, అల్లడం మొదలు పెట్టింది. ఇక అక్కడి నుంచి ఆగకుండా చక్కతో, గాజు తో, రంగు రాళ్లతో కూడా జనపనారను కలిపి ఎన్నో అద్భుతమైన డిజైన్లు చేయడం మొదలు పెట్టింది. 

మొదట్లో మందకొడిగా… 

ఆమె పూర్తిగా ఇందులో నైపుణ్యం సాధించిన తర్వాత తన తోటి వారికి కూడా వీటిని నేర్పించింది. 2015లో ఈ చేతిపనిలో నైపుణ్యం సాధించిన ఆమె ఒక కంపెనీ కూడా స్థాపించింది. అయితే అప్పటికీ ఒకే ఒక్క మహిళ తన కంపెనీలో చేరేందుకు సిద్ధమైంది. 5 వేల రూపాయల పెట్టుబడి తో మొదలైన ఈ కంపెనీ మార్కెటింగ్ రంగం వైపు అడిగేసింది. మొదట్లో పూజకి నాలుగు నుండి ఐదు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. అవి కూడా ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు మాత్రమే కొనేవారు.

తర్వాత మెరిసి… 

ఆమె ద్వారా తయారు చేయబడిన వాటిని కొనే వారు తక్కువ ఉన్నారు. తన దగ్గర ఉన్న ఒక్క ఉద్యోగినికి కూడా డబ్బులు ఇవ్వడానికి ఆమె అప్పుడు ఇబ్బంది పడింది. అయితే సమయం గడిచేకొద్దీ పూజ వ్యాపారం విపరీతంగా వృద్ధి చెందింది. అలా ఒక్కొక్కరుగా కస్టమర్లను పెంచుకుంటూ కొద్దిరోజుల్లోనే ఆమె బిజినెస్ పది రెట్లు పెరిగింది. దీంతో మరో 25 మహిళలు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి ఆ కంపెనీలో చేరారు. 2020 నాటికి రోజుకి వారికి 150 ఆర్డర్లు రావడం గమనార్హం. పూజ ఇచ్చే క్వాలిటీ బయట ఎక్కడా లేకపోవడం… సరసమైన ధరలకే అన్నీ డిజైన్లు అందుబాటులో ఉండడంతో ఆమె నెలకు లక్షల రూపాయల లాభం చూస్తోంది.


Share

Related posts

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజా:’నిహారిక’కు నిశ్చయం అయ్యిందా?

somaraju sharma

అదిరా బాలకృష్ణ అంటే ! కాలర్ ఎగరేస్తున్న అభిమానులు !!

Yandamuri

సింగర్ హారికా నారాయణ్ కు యాంకర్ రవి ప్రపోజ్.. అన్నయ్యా అంటూ అందరి ముందు పరువు తీసింది

Varun G