NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Madanapalle : మదనపల్లి ఘటనలో మతిపోగొట్టే మలుపులు!హారర్ సినిమాను తలపిస్తున్న రియల్ స్టోరీ!

Madanapalle : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

madanapalle incident turns out to be amazing
madanapalle incident turns out to be amazing

ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నిందితులిద్దరు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. మా ఇంట్లో దేవుళ్లున్నారనీ..మా కూతుళ్లని ఆ దేవుళ్లు బతికిస్తారనీ..గతంలో కూడా మా ఇంట్లో ఎన్నో మహిమలు జరిగాయనీ చెప్పుకొస్తున్నారు.

Madanapalle : అసలేం జరిగిందంటే!

ఈ కేసులో ఇద్దరు అక్కచెల్లెళ్లలో చెల్లెలు సాయి దివ్యకు దెయ్యం పట్టిందంటూ అక్క అలేఖ్య చెల్లెలిని డంబెల్స్ తో కొట్టి చంపింది. ఆ తరువాత చెల్లెలు మృతదేహంపై ముగ్గులు వేసి చెల్లెలి ఆత్మ బైటకు వెళ్లకుండా బంధించింది అలేఖ్య. ఈక్రమంలో చెల్లెలిని బతికించటానికి తనను కూడా చంపాలని తల్లిదండ్రులను కోరింది అలేఖ్య. చెల్లెలి ఆత్మ బయటకు వెళ్లకుండా ఉండాలంటే తాను కూడా ఆత్మగా మారి చెల్లెలు ఆత్మను తిరిగి తీసుకొస్తానని..చెప్పింది. ఆ తరువాత తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజ, అలేఖ్య మొత్తం ముగ్గురూ కలిసి ఇంట్లో నగ్నంగా కూర్చుని పూజలు చేశారు. ఆ తరువాత అలేఖ్యను పూజ గదిలోకి తీసుకెళ్లి ఆమె నోట్లో చిన్న రాగి కలశాన్ని పెట్టి..దాంట్లో నవ ధాన్యాలను పోసి..అలేఖ్య తలపై గట్టిగా డంబెల్స్ తో కొట్టటంతో అలేఖ్య కూడా ప్రాణాలు విడిచింది.ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..పిల్లలిద్దరినీ హత్య చేసిన తరువాత భార్యాభర్తలిద్దరూ కూడా చనిపోవటానికి ప్లాన్ చేసుకున్నారు.పిల్లల్ని చంపి వారు కూడా చనిపోతే..మరో జన్మలో నలుగురు ఒకేఇంట్లో కలిసి పుడతారని వాళ్లు నమ్మారు. కానీ ఈ విషయం బైటకు తెలియటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
తిరుగుతున్నాయి..మళ్లీ బతికి వస్తారని చెబుతున్నారీ భార్యాభర్తలు..

Madanapalle : ప్రముఖ బాబా శిష్యరికం!

కాగా..ఈ దారుణాలకు ఒడిగట్టిన భార్యా భర్తలు పురుషోత్తం, పద్మజలు ఓ ప్రముఖ బాబా శిష్యులని తెలుస్తోంది. వీళ్లిద్దరూ విద్యావంతులే. పిల్లలను కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ మూఢత్వంతో మొత్తం కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసేశారు. తండ్రి పురుషోత్తం మదనపల్లి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాగా.. తల్లి పద్మజ మాస్టర్ మైండ్ స్కూల్ కు ప్రిన్సిపల్‌ గా, కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా కాలం నుంచి ఇంటికే పరిమితమైన వీరు.. ఎవరితో కలిసేవారు కాదని స్థానికులు చెబుతున్నారు. పెను సంచలనం కలిగించిన ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మా ఇల్లు మహిమాన్వితం!

ఈ దారుణ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగింది. ఈ కేసు విచారణలో భాగంగా పురుషోత్తం, పద్మజలు పొంతన లేకుండా ఇష్టమొచ్చినట్లుగా సమాధానాలు చెబుతున్నారు. ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు పోయాయి. కానీ మా ఇంట్లో దేవుళ్లున్నారు. మా ఇల్లు చాలా మహిమలు గల ఇల్లు..కాబట్టి మా కూతుళ్లు బతికొస్తారనీ..అలా వారం రోజులుగా అర్థరాత్రి ఇంటి బయటా లోపలా పూజలు చేశామని చెబుతున్నారు. పైగా ఈ కలియుగం అంతమైపోయింది. సత్యయుగం మొదలైంది అని చెప్పుకొస్తున్నారు. మా పిల్లలిద్దరికి గతంలో అనారోగ్యం చేస్తే..ఇలా పూజలు చేసే వాటిని తగ్గించామని చెబుతున్నారు. ఈ జన్మలో కలిసి ఉండటం చేతకాక..ప్రస్తుత జీవితాలను వదిలివేసి వచ్చే జన్మ కోసం పూజలు చేశామని వారు పోలీసులకు చెప్పారు.హత్యలుచేసి ఆ తర్వాత భయానక పూజలు నిర్వహిస్తున్న ఈ దంపతులను చూసి పోలీసులే కంగారు పడుతున్నారు.

వారు మానసిక వ్యాధిగ్రస్తులు!

ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం కలిగించిన జంట హత్యల కేసులో మృతులు తల్లితండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యురాలు రాధిక వైద్య పరీక్షలు నిర్వహించారు.పద్మజ తండ్రి ఇటీవలే మానసికి వ్యాధితో బాధ పడుతూ ఇటీవల చినపోయినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. పద్మజ మేనత్త కూడా మానసిక వ్యాధితో బాధ పడుతోందని తెలిసింది. పద్మజ కూడా తీవ్ర మానసిక వ్యాధితో బాధ పడుతోంది. దీన్ని మానసిక శాస్త్రంలో డెల్యూషన్స్ అంటారని డాక్టర్ రాధిక వివరించారు.ఈ వ్యాధి గ్రస్తులు తాము నమ్మిన విషయాన్ని బలంగా విశ్వసిస్తారు.పద్మజకున్న మానసిక సమస్యను భర్త కూతుళ్లకు కూడా అంటించింది. అయితే పద్మజ, పురుషోత్తం నాయుడు రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆమె వివరించారు.

 

author avatar
Yandamuri

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju