NewsOrbit
న్యూస్

Madanapalle Murder Case : మెంటల్ హాస్పిటల్ టు మదనపల్లి సబ్ జైలు ! డబుల్ మర్డర్ కేసులో నిందితుల మజిలీ !

Madanapalle Murder Case : సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు సోమవారం విశాఖ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారిని మదనపల్లి సబ్ జైలుకి తరలించారు పోలీసులు. జనవరి 24న మదనపల్లికి చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు ఆలేఖ్య, సాయి దివ్య లను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

madanapalle murder case couple discharged from vizag mental care hospital to be shifted to jail
madanapalle murder case couple discharged from vizag mental care hospital to be shifted to jail

ఈ కేసులో దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి మానసిక స్థితి సరిగా లేదని ఫిబ్రవరి 4న చికిత్స కోసం విశాఖ మానసిక హాస్పిటల్‌కు తరలించారు. విశాఖ మానసిక హాస్పిటల్ డాక్టర్లు ఇరువురికీ మెరుగైన వైద్యం అందించారు. దీంతో దంపతులు కోలుకున్నారు. కూతుళ్ల హత్యలపై వారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది…

మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌కు చెందిన ఎన్‌.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె బోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.

వీరంతా గతేడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు.ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపారని, ఆ తరువాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారనే ఆరోపణలతో కేసు నమోదైంది. పునర్జన్మ అనే మూఢనమ్మకంతో కూతుళ్లను తల్లిదండ్రులే హత్య చెయ్యడం సంచలనంగా మారింది.

ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. రాత్రి 11గం.ల సమయంలో పురుషోత్తం నాయుడు, పద్మజ ఇంటికి వెళ్లగా అప్పటికే పూజా గదిలో ఒకరు… డ్యూఫ్లెక్స్ భవనంలో పైన బెడ్ రూమ్ లో మరొకరు చనిపోయి ఉండడం గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ తర్వాత ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.ఇప్పుడు నిందితులు మానసిక వైద్యశాల నుండి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!

author avatar
Yandamuri

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju