Madhavan: తమిళ్ హీరో మాధవన్ తాజాగా ఒక నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. దాంతో ఆ నెటిజన్ తాను చేసిన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేసుకున్నాడు. కానీ అప్పటికే మిగతా నెటిజన్లు ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేస్తున్నారు. మాధవన్ తెలివిగా ఇచ్చిన కౌంటర్‌కు అభిమానులను ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ నెటిజన్ చేసిన ట్వీట్ ఏంటి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మాట జారిన నెటిజన్
మాధవన్ ఇటీవల నంబీ నారాయణన్ అనే ఒక ఇస్రో శాస్త్రవేత్త జీవిత సంఘటనల ఆధారంగా “రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్” సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సినీ విమర్శకులు, ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మూవీ చూసిన ఒక నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శించి మాధవన్ కు అడ్డంగా దొరికిపోయాడు. ఇతడు సినిమా చూసినట్టు చెబుతూ.. “నిన్న నేను రాకెట్రీ సినిమా చూశాను. లాస్ట్ సీన్ మళ్ళీ మళ్ళీ చూడాల్సి వచ్చింది. మాధవన్ డైరెక్షన్లో వచ్చిన తొలి సినిమా అద్భుతంగా ఉంది. ఇక అతని యాక్టింగ్ స్కిల్స్‌కి వంక పెట్టాల్సిన అవసరమే లేదు” అని ఒక ట్వీట్ పెట్టాడు.
మాధవన్ దిమ్మ తిరిగి రిప్లై
అయితే ఈ ట్వీట్ మాధవన్ దృష్టికి వచ్చింది. సాధారణంగా థియేటర్లో ఒక సీన్‌ను మళ్లీ మళ్లీ చూడటం కుదరదు. కానీ ఈ నెటిజన్ మాత్రం తాను రిపేటెడ్గా చూసినట్టు చెప్పాడు. దాంతో ఇలా చూడటం కేవలం పైరసీలో మాత్రమే సాధ్యమవుతుందని మాధవన్ గ్రహించాడు. పైరసీ మాట ఎత్తకుండానే.. “ఏంటి నువ్వు ఆ సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ చూసావా, అలా ఎలా చూసావ్?” అని రీ-ట్వీట్ చేస్తూ ప్రశ్నించాడు. దాంతో తన అత్యుత్సాహం తన కొంపముంచిందని తెలుసుకున్న సదరు ట్విట్టర్ యూజర్ వెంటనే తన ట్వీట్ డిలీట్ చేసుకున్నాడు. అయితే దీని స్క్రీన్‌షాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా మంది అభిమానులు ఇతన్ని తిట్టిపోస్తున్నారు. ఇలా పైరసీని ఎంకరేజ్ చేసే వారి వల్ల చిత్ర పరిశ్రమ తలకిందులు అవుతోంది, చూస్తుంటే అభిమానిలా ఉన్నావ్, ఎంచక్కా థియేటర్‌కు వెళ్లి మూవీ చూడకుండా… ఇలా పైరసీ చూడటం ఏంటి అని ఇంకొందరు అతన్ని విమర్శిస్తున్నారు.