గజినీ మూవీలో హీరో ఆఫర్ వదులుకున్న ఆ స్టార్ యాక్టర్.. ఎందుకంటే!

Share

మాధవన్ హీరోగా ఇటీవలే విడుదలైన ‘రాకేట్రి’ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మూవీ అంచనాలకు మించి సక్సెస్‌ సాధించడంతో మాధవన్ ఫుల్ ఖుషి అవుతున్నాడు. మాధవన్ తన సినిమా సక్సెస్ అయిన సందర్భంగా హీరో సూర్యతో ఒక వీడియో చాట్‌లో పాల్గొన్నాడు. ఇదే చాట్‌లో సూర్య, మాధవన్ రకరకాల విషయాలు గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే మాధవన్‌ ఒక సంచలన నిజం బయట పెట్టాడు. దాంతో అందరూ అవాక్కవుతున్నారు.

గజినీలో హీరో క్యారెక్టర్ తొలత మాధవన్‌కే వచ్చింది

“సూర్య నటించిన గజినీ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీలో హీరోగా చేసే ఆఫర్ ఫస్ట్ నాకే వచ్చింది, కానీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను. గజినీ సినిమా డైరెక్టర్ మురుగుదాస్ నాకు కథ వినిపించినప్పుడు సెకండఫ్ నాకు కనెక్ట్ అవలేదు. తరువాత ఆ కథ సూర్య చెంతకు చేరింది. ఆ క్యారెక్టర్ లో మిమల్ని చూసాక నేను చాలా సంతోషించాను.” అని మాధవన్ పేర్కొన్నాడు. గజినీ క్యారెక్టర్‌లో సూర్య చాలా బాగా నటించారని… ఆ క్యారెక్టర్‌కు సూర్యకి సరిగ్గా సెట్ అయిందని మాధవన్ చెప్పుకొచ్చారు. గజినీ పాత్రలో నటించడం చాలా కష్టమని.. సిక్స్ ప్యాక్ వెనుక ఉన్న కష్టాన్ని తాను అర్థం చేసుకోగలం అని అన్నారు.

కెరీర్‌కు న్యాయం చేయలేకపోతున్నా

మాధవన్ సూర్యని ఉద్దేశిస్తూ.. “మిమ్మల్ని సంజయ్ రామస్వామి పాత్రలో చూశాక నా సినిమాలకి, నా కెరీర్‌కు నేను న్యాయం చేయలేకపోతున్నానని అనుకున్నాను. గజినీ తరువాతనే మీ తలరాత మారిపోయింది. ఇండస్ట్రీలో నాకు ఉన్న మంచి స్నేహితుల్లో నువ్వు, జ్యోతిక ప్రథమ స్థానంలో ఉంటారు. మీతో సమయం గడిపిన తరువాత స్నేహం అంటే ఏంటో తెలుసుకున్నాను. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీరు నాకు తోడుగా వుంటారు” అంటూ చెప్పుకొచ్చాడు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

39 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

48 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago