Bigg Boss 5 Telugu: ‘హౌస్ లోనే సన్నీ ఆత్మహత్య చేసుకోబోతున్నాడు’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు !

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ గేమ్ చివరి దశకు చేరుకున్న సమయంలో ఉత్కంఠభరితంగా ఉంది. హౌస్ లో సభ్యులు ఇతర కంటెస్టెంట్ లతో ఏర్పడిన రిలేషన్ తో… బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఏదైనా అంటే గేమ్ పరంగా తీసుకోకుండా.. ఎమోషనల్ అయిపోయి రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. గత సీజన్లో కంటే సీజన్ ఫైవ్ లో.. ఇటువంటి తరహాలో సంఘటనలు బాగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల షణ్ముక్(Shanmuk), సిరి(Siri) మధ్య జరిగిన గొడవ ఆ తర్వాత షణ్ముక్ బాత్ రూం లోకి వెళ్ళటం.. సిరి షణు నీ ఓదార్చాలి అనుకుంటున్న సమయంలో.. ఇద్దరి మధ్య సీరియస్ గొడవ బాత్రూంలోకి వెళ్లిన సిరి తల బద్దలు కొట్టుకోవడం జరిగింది.

sunny: Bigg Boss Telugu 5: Actress Madhavi Latha comes in support of Sunny  over his ugly spat with Priya; says, "No more women card" - Times of India

ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న తరుణంలో హౌస్ లో జరుగుతున్న పరిణామాల గురించి బయట సెలబ్రిటీలు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు. దీనిలో భాగంగా యాంకర్ మాధవిలత ఇప్పటికే…హోస్ట్ నాగార్జున(Nagarjuna) పై గత వీకెండ్ ఎపిసోడ్ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా ఈ మాధవీలత ఇప్పుడు… టైటిల్ విన్నర్ రేసులో ఉన్న సన్నీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళితే … యాంకర్ రవి(Ravi) ని కార్నర్ చేస్తూ.. ఇన్స్ స్టాగ్రం లో సంచలన పోస్ట్ పెట్టింది. హౌస్ లో రవి(Ravi)… సన్నీ(Sunny), మానస్(Manas), కాజల్ గాంగ్ నీ… మూడు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఇక ఇదే తరుణంలో సిరి అవసరం అందరిని అన్నయ్య అని.. అనాలని షణ్ముక్ కామెంట్లు చేయటానికి ఖండించింది.

Nagarjuna : నాగార్జున‌పై మాధ‌వీల‌త సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. ఆ విధంగా  చేస్తున్నారంటూ కామెంట్‌.. - India Daily Live

బిగ్ బాస్ టీం, హోస్ట్ నాగార్జున కలిసి

మరోపక్క ఇదే సమయంలో… బిగ్ బాస్ టీం, హోస్ట్ నాగార్జున కలిసి ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునే అంత అవమానిస్తూ అత్యంత దారుణంగా… మానసిక క్షోభకు గురి చేస్తున్నారని.. పరోక్షంగా సన్నీని ఉద్దేశించి మాధవి లత కామెంట్ చేసింది. ఇటువంటి ఘటనలపై మానవ హక్కులు మరియు ప్రజా సంఘాల వారు పెద్దగా పట్టించుకోరు.. ఇటువంటివి మనం ఖండించాలి అని సోషల్ మీడియాలో పేర్కొంది. కావాలని సన్నీని.. తప్పుగా చూపించడానికి బిగ్ బాస్ టీం.. అదే రీతిలో నాగార్జున వ్యవహరిస్తున్నట్లు.. హౌస్ లోనే సన్నీ ఆత్మహత్య చేసుకునేలా… వాతావరణం క్రియేట్ చేస్తున్నట్లు తనదైన శైలిలో మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో మాధవీలత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

దీపికా పడుకొనే హ్యాండుబాగ్ ఖర్చుతో ఒక మిడిల్ క్లాస్ ఫామిలీ హాయిగా బ్రతికేయొచ్చు!! ఖరీదు ఎంతో తెలుసా???

Naina

“ఆచార్య” టీజర్ రిలీజ్ డేట్..??

sekhar

ఎవరికైనా దమ్ము ఉంటే పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ చేసిన రేణు దేశాయ్..!!

sekhar