MP Komatireddy: కాంగ్రేస్ ఎంపి కోమటిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు..?

Share

MP Komatireddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు స్వపక్షంలోని నేతలపై డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తుంటారు. ప్రత్యర్ధి పార్టీ నేతలకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతుంటారు. పార్టీ స్టాండ్ కు భిన్నంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది కొత్త ఏమీ కాదు. ఇటీవల వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైెఎస్ షర్మిల తల్లి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ 12వ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంకు కాంగ్రెస్ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరైన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ముందే పార్టీ నాయకులు ఎవరూ వెళ్లవద్దంటూ ఆ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించింది. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయమ్మ ఏర్పాటు చేసిన సమ్మేళనానికి హజరైయ్యారు. అనంతరం కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ కూడా చేశారు. పార్టీ ఆదేశాలు దిక్కరించి విజయమ్మ సభకు హజరు అయిన కోమటిరెడ్డి పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అంశంపై పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపి ముధుయాష్కీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

madhu yashki hot comments on mp komatireddy
madhu yashki hot comments on mp komatireddy

పార్టీని వీడాలనుకుంటున్న వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని, పార్టీలో ఉండి వెన్నుపోటు రాజకీయాలు చేయవద్దని కోరారు. విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదనీ, రాజకీయ సమ్మేళనమని పేర్కొన్నారు. దీనికి వెళ్లవద్దని పార్టీ ఆదేశించినా కొందరు వెళ్లారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే రాజకీయ వేదికపైకి వెళ్లి మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. ఎంపి కోమటిరెడ్డి అయినా తానైనా రాజకీయంగా ఎదిగాము అంటే అది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వల్లనేనని అన్నారు. వైఎస్ బ్రతికి ఉంటే అసలు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదన్న విజయమ్మ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని మధుయాష్కీ ప్రశ్నించారు. పార్టీ ఆదేశాలను దిక్కరించి విజయమ్మ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం హజరైన కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని మధు యాష్కీ పేర్కొన్నారు.


Share

Related posts

Poll : ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై స్పీకర్ ఓ ప్రకాష్ బిర్లా వేటు వేస్తారని మీరు అనుకుంటున్నారా…? లేక వైసీపీ వేసిన పిటిషన్ ని కొట్టేస్తారా…?

ramu T

Kangana Ranaut: కంగనా రనౌత్ కి కరోనా పాజిటివ్..!!

bharani jella

Madanapalle Double Murder: జంట హత్యల గురించి భూతవైద్యుడు చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే!!

Naina