న్యూస్ సినిమా

వారి లవ్ స్టోరీ లో సినిమానితలపించే చిక్కుముడులు..ఓపెన్ అయిన సెలబ్రిటీ జోడీ

Share

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలోని క్యూట్ క‌పుల్స్‌లో శివ‌బాలాజీ-మ‌ధుమిత జంట ఒకటి. ఈ జంటకి ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ మొదటిసారి కలిసింది ఇంగ్లీష్ కార‌న్ అనే చిత్రంలోనేనట. ఆ త‌రువాత ప్రేమ‌లో ప‌డి, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ఈ జంట. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే పెళ్లికి ముందు వీరిద్దరికి బ్రేక‌ప్ అయ్యిందట. ఈ విష‌యాన్ని స్వయంగా వారే ఈటీవీ ఛానల్ లో అలీ వ్యాఖ్య‌త‌గా ప్రసారమయ్యే అలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్‌లో రివీల్ చేశారు. మధుమిత మాటాడుతూ వారిద్దరూ ఒకరికొకరు ప్రొపొసె చేసుకోలేదని, త‌న‌కు శివ బాలాజీ డైరెక్ట్‌గా పెళ్లి ప్ర‌పోజ‌ల్ తీసుకొచ్చాడ‌ని మ‌ధుమిత చెప్పుకొచ్చింది. 

ఇంతకీ మా పెళ్లికి బాలాజీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నా మా ఇంట్లో ఒప్పుకోలేద‌ని ఆమె చెప్పింది. ఒకసారి షూటింగ్ లో ఉన్నప్పుడు శివ బాలాజీని గొడ‌వ పడుతుండగా మధుమిత వాళ్ళ అమ్మ చూసారని దీంతో మంచి ఇంప్రెష‌న్ రాలేద‌ని అందుకే మొద‌ట్లో ఆమె ఒప్పుకోలేద‌ని చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం కూతురు కంటే అల్లుడంటేనే ఆమెకు ఎక్కువ ఇష్ట‌మ‌ని మ‌ధుమిత పేర్కొంది.

ఇంకేముంది పెళ్లి చేసుకుందాం అనుకునే సమయానికి త‌మ జాత‌కాలు క‌ల‌వ‌లేదని అన్నారట. శివ బాలాజీ వాళ్ల ఇంట్లో జాత‌కాలపై బాగా న‌మ్మ‌కం ఉండ‌టంతో విడిపోవాలిసి వచ్చిందని మ‌ధుమిత‌ తెలిపారు. 

ఈ విషయమై శివ బాలాజీ మాట్లాడుతూ నిజంగా నా జీవితంలో అదొక దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌. అప్పటిలో నేను దానికి చాలా బాధ‌ప‌డ్డా అని అన్నారు. ఇంక బ్రేక‌ప్ అయ్యాక ఒక సంవ‌త్స‌రం పాటు ఎదురుచూసా ఒకవేళ ఈ లోపు త‌న‌కు గానీ నాకు గానీ వేరే పెళ్లి అయితే ఇంక తనని వ‌దిలేద్దాం అనుకున్నా. కానీ ఏడాది త‌రువాత మ‌ళ్లీ మా జాత‌కాలను చుపించాము అపుడు కలిసాయి అనడంతో మేము పెళ్లి చేసుకున్నాం అని శివ బాలాజీ చెప్పుకొచ్చారు. 

 


Share

Related posts

Pushpa Movie : “పుష్ప” సినిమాలో బన్నీ తో పాటు ఆ స్టార్ హీరో..అభిమానులకు ఇక పూనకాలే..!!

sekhar

“రెబల్” హొండా నుండి కొత్త బైక్..! ఫీచర్లు చూసేయండి..!!

bharani jella

Balakrishna: బాలకృష్ణ డైరెక్టర్ తో రామ్ పోతినేని..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar