Madhuranagarilo november 11 episode 207: ఇంతలో ఆఫీస్ నుంచి శ్యామ్ కి ఫోన్ చేసి త్వరగా ఆఫీస్ కి రండి సార్ అని అంటారు. రాధా నేను అర్జెంటుగా ఆఫీస్ కి వెళ్ళాలి అని శ్యామ్ అంటాడు. అదేంటండి అక్క వస్తుంది కదా కాసేపు ఉండండి అని రాదా అంటుంది. సారీ రాధా మీ అక్కని కలవలేక పోతున్నాను ఇంకెప్పుడైనా మళ్ళీ కలుస్తాను లే అంటూ శ్యామ్ వెళ్లిపోతాడు. ఇంతలో రుక్మిణి వచ్చి మీ ఆయన ఎక్కడ అని అడుగుతుంది. ఇప్పుడే వెళ్ళాడు అక్క కారు దగ్గర ఉన్నట్టున్నాడు పద చూద్దాం అని రాదా అంటుంది. అమ్మ ముడుపు కడతానని మొదలుపెట్టి మధ్యలో ఆపకూడదు అరిష్టం జరుగుతుంది అని పంతులుగారు అంటాడు. సరే రాధా కార్ నెంబర్ చెప్పు నేను వెళ్లి మీ ఆయనను కలుస్తాను అని రుక్మిణి అంటుంది. రాధా కార్ నెంబర్ చెప్పగానే బయటికి వెళ్లి రుక్మిణి, బయట ఎవరో కారు పక్కన నిలబడితే అతని దగ్గరికి వెళ్లి బావగారు బాగున్నారా నేనెవరో గుర్తుపట్టారా అని అంటుంది. మీరెవరో నాకు తెలియదండి అని అతను అంటాడు.

మీ పెళ్లికి రాలేకపోయాను కదా మీ ఆవిడ వాళ్ళ అక్కను బావగారు అని రుక్మిణి అంటుంది. మీరు పెళ్లికి రాలేదు కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను అని అతను అంటాడు. ఏంటి ఫోన్ లో ఎవరితోటో మాట్లాడుతున్నారు గర్ల్ ఫ్రెండ్ అని రుక్మిణి అడుగుతుంది. ఆ మాట వాళ్ళ ఆవిడ విని వచ్చి ఏంట్రా నీ మొహానికి నేనే ఎక్కువ అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా నా అని గల పట్టుకుని అడుగుతుంది. మీరెవరండి అని రుక్మిణి అడుగుతుంది. ఈయన పెళ్ళాన్ని అని ఆవిడ అంటుంది. సారీ అండి ఇందులో మీ ఆయన తప్పేమీ లేదు మా చెల్లెలి వాళ్ళ భర్త అనుకోని అలా మాట్లాడాను అని రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాదా వాళ్ళ బావ త్వరగా దొరకాలని మొక్కుకొని ముడుపు కడుతూ ఉండగా రుక్మిణి వచ్చి రాదా అని గట్టిగా పిలుస్తుంది. అలా పిలవగానే రాదా ముడుపు కట్టడం వదిలేసి వాళ్ల అక్కవైపు చూస్తుంది. ఆ ముడుపు కింద పడబోతుండగా పండు పట్టుకుంటాడు. ఏంటమ్మా అంత గట్టిగా అరిసావు మూడుపు కింద పడితే కోరిక నెరవేరేది కాదు అని పూజారి అంటాడు. సారీ రాదా నీకు ఒక విషయం చెప్పాలని ఆనందాలో అలా పిలిచాను అని రుక్మిణి అంటుంది.

ఏం పర్వాలేదులే అక్క అని మళ్ళీ రాదా ముడుపు కడుతుంది. కట్ చేస్తే,నీ మాటల వల్ల వాళ్ళ ఆవిడ చేతిలో దెబ్బలు తిన్నాడన్నమాట అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. సరే అక్క మా ఇంటికి వెళ్దాం పద అని రాధా రుక్మిణి తీసుకొని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే, మధుర మన ఇంటికి ఇద్దరు కోడలు వచ్చారు అని ధనంజయ్ అంటాడు. ఇద్దరు కోడలు ఎవరండీ అంటూ మధుర హాల్లోకి వస్తుంది. రాధా రుక్మిణి లోపలికి వస్తారు. రామ్మా కూర్చో మంచి నీళ్లు తెస్తాను అని మధుర అంటుంది. అత్తయ్య మీరు మంచి నీళ్లు తేవడం ఏంటి ఏ ఇంట్లోనైనా అత్త కోడలితో పని చేయించుకుంటుంది కదా ఇక్కడ ఏంటి అంతా తేడాగా ఉంది అని రుక్మిణి అంటుంది. అత్తా కోడలు అనే వేరువేరుగా మేము ఉండమమ్మా కలిసిమెలిసి ఉంటాము అని మధుర అంటుంది.

నిజంగా మీ అత్త కోడలు ఆదర్శవంతులు అత్తయ్య గారు మీ ఇంటికి కోడలు అవడం మా రాధా అదృష్టం అని రుక్మిణి అంటుంది. పెద్ద కోడలు సర్టిఫికెట్ ఇచ్చేసింది అని పండు అంటాడు. అదేంట్రా పెద్ద కోడలు ఎలా అవుతుంది అని మధుర అంటుంది. మా అమ్మకు అక్క అయినప్పుడు నాకు పెద్దమ్మ అవుతుంది నాకు పెద్దమ్మ అయినప్పుడు ఈ ఇంటికి పెద్ద కోడలు అవుతుంది కదా అని పండు అంటాడు. ఉన్న అత్తయ్య గారు ఈరోజు ఈ పెద్ద కోడలు పెత్తనం ఇంట్లో నడుస్తుంది అని రుక్మిణి అంటుంది. సరే అమ్మ మీరు ఎలా కూర్చోండి నేను వంట చేస్తాను అని మధుర అంటుంది. అదేం కుదరదు అత్తయ్య గారు పెద్ద కోడలుగా ఈరోజు వంట అంతా నేనే చేస్తాను మీరు కూర్చోండి అని రుక్మిణి అంటుంది.

అమ్మ నేను వెళ్లి ఆడుకుంటాను అని పండు బయటికి వెళ్తాడు. రుక్మిణి చకచకా వంట చేసేసి రాధా వంట అయిపోయింది అని అంటుంది. అవునా అక్క ఏం వంట చేశావు అని రాదా అడుగుతుంది. ఆలు వంకాయ చేశాను రాదా అని రుక్మిణి అంటుంది. అవునా అక్క ఆలు వంకాయ అంటే మా ఆయనకి ఎంత ఇష్టమో అని రాదా అంటుంది. సరే రాక అందరం అన్నం తిందాము అని రాదా అంటుంది. మీ ఆయన వచ్చాక అందరం కలిసి తిందాం లే రాదా అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే రుక్మిణి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్తుంది.

శ్యామ్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా వాళ్ల అత్తయ్య మామయ్య కనపడతారు. కారు పక్కకు ఆపి ఇదేంటి మామయ్య మీరెప్పుడొచ్చారు అని శ్యామ్ అడుగుతాడు.మావయ్య నీ హాస్పిటల్లో చూపిద్దామని తీసుకు వచ్చాను బాబు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. మీరు హాస్పిటల్ కి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే నేను దగ్గరుండి చూపించే వాడిని కదా మామయ్య గారు అని శ్యామ్ అంటాడు. ఇప్పటికి చేసింది చాల్లే బాబు అని మురళి వెటకారంగా అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది