ప్రసంగం చదవలేక!

గ్వాలియర్(మధ్యప్రదేశ్),జనవరి26: రిపబ్లిక్‌ డే వేడుకల్లో మధ్యప్రదేశ్‌ శిశు సంక్షేమశాఖామంత్రి  ఇమార్తి దేవి  గ్వాలియర్‌లో జెండా ఎగరేసిన  అనంతరం తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి కలెక్టర్ భరత్ యాదవ్‌‌ను చదవాల్సిందిగా కోరారు.   రాష్టంలో దాబ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు  ఆమె ఎన్నికయ్యారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులలో  ఆమె పనిచేశారు.

తన  ఆరోగ్యం సరిగాలేకపోవడంతో చదవలేకపోయినట్లు మంత్రి వివరణ ఇచ్చారు.

ఈ వీడియో వైరల్ అయ్యింది.

(ఎఎన్ఐ సౌజన్యంతో )