NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Maha Padayatra: బీజేపీ ఇక రాజధాని పోరాటం.. రేపు పాదయాత్రలో పాల్గొంటారట..!

Maha Padayatra: BJP Involving in Direct Capital Issue

Maha Padayatra: బీజేపీ ఏపీలో తమ పోరాటాం మొదలు పెట్టడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. ఏపీ బీజేపీలో నాలుగైదు గ్రూపులు, వర్గాలతో సతమతంగా ఉన్న పార్టీకి ఇటీవల అమిత్ షా వచ్చి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే సోము వీర్రాజు, సునీల్ ధియోధర్, జీవీఎల్ నరసింహారావు లాంటి నేతలకు గట్టిగానే క్లాస్ పీకారని వార్తలు వచ్చాయి. “ప్రజల్లో బలపడాలంటే.. ప్రభుత్వం తరపున మాట్లాడడం కాదు.., ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలి. మనకు వైసీపీ మిత్రపక్షం కాదు, నేరుగా రాజధాని ఉద్యమంలో పాల్గొనాలని” అమిత్ షా సూచించడంతో ఏపీ బీజేపీ నాయకులు కదిలారు. ఈ వ్యాఖ్యలు టీడీపీకి అనుకూలంగా ఉండే బీజేపీ నేతలకు బూస్టులా పనిచేసాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్, పురందేశ్వరి వంటి వారు నాటి నుండి అమరావతి ఉద్యమములో నేరుగా పాల్గొనేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఎట్టకేలకు నిన్న, ఈరోజు సమేవసం పెట్టుకుని.. రేపటి నుండి అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొనాలని డిసైడ్ అయినట్టు సమాచారం..

Maha Padayatra: BJP Involving in Direct Capital Issue
Maha Padayatra BJP Involving in Direct Capital Issue

Maha Padayatra: రేపు పాదయాత్రలో పాల్గొననున్న బీజేపీ అగ్ర నేతలు. .!

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర 25 రోజులు దాటింది. బీజేపీ నుండి ఇప్పటి వరకు నేరుగా పాల్గొనలేదు. వారి రియాక్షన్ కూడా తెలియజేయలేదు. తలతిక్క మాటలు, అడ్డగోలు వాదనలు తప్ప నేరుగా అనుకూలమో, ప్రతికూలమో చెప్పలేదు. సో.. రేపటి నుండి ఈ వైఖరిని వీడి నేరుగా పాల్గొన బోతున్నారు. రేపు పాదయాత్రలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరీ, సత్య కుమార్ పాల్గొని సంఘీభావం తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతులపై దాడులు సరికాదని.. ఈ చర్యలను అందరూ ఖండించాలన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని, కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పటికే తాము అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. అంతేకాదు.. అతి త్వరలోనే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో పాటు పలువురు నేతలు ఉద్యమంలో పాల్గొనబోతున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju