Categories: న్యూస్

‘మహా’ సీఎం ఏక్ నాథ్ కీలక నిర్ణయం … వాహనదారులకు గుడ్ న్యూస్

Share

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ శిందే తీసుకున్న ఓ కీలక నిర్ణయం వాహనదారులు సంతోషించేదిగా ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలు ప్రయాణిస్తున్న సందర్భాల్లో పోలీసులు ఆ మార్గంలో భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు వాహనదారులను నిలుపుదల చేస్తుంటారు. ఆ మార్గంలో సీఎం లేదా ఇతర వీవీఐపీ వెళ్లే వరకూ సాధారణ వాహనాలను, వాహన చోదకులను పది పదిహేను నిమిషాలకు పైగా నిలుపుదల చేస్తుంటారు. దీంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో సారి వీవీఐపీ మూమెంట్ లేటు అయితే ఎక్కువ సేపు వాహనదారులు నిలిచిపోవాల్సి వస్తుంటుంది. వాహనదారులు పడుతున్న ఇబ్బందులు గమనించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే ఇకపై వాహనదారులకు అటువంటి అవస్థలు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నారు.

 

బ్రేకింగ్ : వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కారణం ఏమిటంటే..?

శుక్రవారం ముంబాయి కమిషనర్ తో భేటీ అయిన సీఎం ఏక్ నాథ్ శిందే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇకపై సీఎం హోదాలో తాను ప్రయాణించే కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను నిలిపివేయాల్సిన అవసరం లేదని అన్నారు. వీవీఐపీల ప్రయాణాల కోసం సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తొందని ఇక అలా జరగడానికి వీలులేదని ఆదేశించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కాన్వాయ్ కి ఎలాంటి ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని సూచించారు. అలానే తాను ప్రయాణించే మార్గాల్లో భద్రతను కూడా తగ్గించాలని చెప్పారు. తమది సామాన్యుల ప్రభుత్వమనీ, అందుకే వీఐపీల కన్నా సామాన్యులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు సీఎం ఏక్ నాథ్ శిందే. సీఎం శిందే తీసుకున్న నిర్ణయం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago