Subscribe for notification

Maharashtra: కాకరేపుతున్న ‘మహా’ రాజకీయం – ఏక్ నాథ్ శిందేకి పెరుగుతున్న మద్దతు

Share

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం కాకరేపుతోంది. శివసేన చీలికవర్గం నేత, మంత్రి ఏక్ నాథ్ శిందేకి క్రమంగా బలం మరింత పెరిగింది. తాజాగా శిందే శిబిరానికి చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు తెలుస్తొంది. వీరిలో దాదాపు 40 మంది శివసేనకు చెందిన వారే ఉన్నారని ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిందే స్వయంగా వెల్లడించారు. తమపై నమ్మకం ఉన్న వారు చేతులు కలపవచ్చని, తాము బాలా సాహెబ్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తామని శిందే అన్నారు. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన నోటీసులు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Maharashtra politics Eknath Shinde Claims 50 MLAs Back Him

 

మెజార్టీగా ఉన్న తమను సస్పెండ్ చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ శిందే తమ నాయకుడుగా పేర్కొంటూ గవర్నర్, డిప్యూటి స్పీకర్ కు లేఖ లు రాశారు. ఉద్దవ్ ఠాక్రే వర్గం 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికే ఈ లేఖలు వెళ్లాయి. బలప్రదర్శనకు కూడా శిందే వర్గం సిద్ధమవుతోంది. శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సీఎం ఉద్దవ్ నిర్వహించిన సమావేశంలో తనతో సహా 13 మంది మాత్రమే హజరయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేలు చేజారిపోవడాన్ని గమనించిన ఉద్దవ్ ముందస్తుగానే రాజీనామా చేయడానికి సిద్దమంటూ ప్రకటించారు. అధికార సీఎం నివాసాన్ని ఖాళీ చేసి మాతోశ్రీకి వెళ్లిపోయారు.

 

మరో పక్క శిండే వర్గం ఇప్పటికే 400 మాజీ కార్పోరేటర్ లతో సమావేశం అయిన నేపథ్యంలో శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ జరపాలని ఉద్దవ్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీలు కూడా ఉద్దవ్ కు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో పార్టీని కాపాడుకునేందుకు ఉద్దవ్ జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. శివసేన చీలక వర్గం నేతలు అందరూ గుహవాటిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేయడంతో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి బయటి వారిని రెస్టారెంట్ లోకి అనుమతించడం లేదని తెలుస్తొంది.


Share
somaraju sharma

Recent Posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

21 mins ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

49 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

1 hour ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

2 hours ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

3 hours ago