Zika Virus: మహారాష్ట్రకు పాకిన జికా వైరస్..! తొలి కేసు నమోదు..!!

Share

Zika Virus: దేశంలోని కేరళ, తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ జీకా వైరస్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటి వరకూ కేరళను వణికిస్తున్న జికా వైరస్ మహారాష్ట్ర కు కూడా పాకింది. మహారాష్ట్రలో శనివారం జీకా వైరస్ తొలి కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.  రూరల్ పూణెలోని పురందర్ లో ఓ మహిళకు జికా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Maharashtra reports first Zika Virus case
Maharashtra reports first Zika Virus case

జికా వైరస్ లక్షణాలు ఉండటంతో అయిదుగురి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపగా ఒకరికి పాజిటివ్ అని తేలిసింది. ఆమెకు బెస్లార్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఇంటికి పంపించారు. బాధితురాలి కుటుంబంలో ఎవరికీ జికా వైరస్ సోకలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ముందు జాగ్రత్త గా ఆ ప్రాంతంలో వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేశారని చెప్పారు. అయితే ఆ ప్రాంతంలో కొందరికి చికున్ గున్యా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు.

ఇటీవల కాలం వరకూ ఒక్క కేరళలోనే జికా వైరస్ కేసులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 61 మంది జికా వైరస్ బారిన పడ్డారు. ఈ వ్యాధి దోమ కాటు మూలంగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీకా వైరస్ బాధితుల్లోనూ డెంగ్యూ లక్షణాలే కనబడుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వైరస్ బాధితులకు జ్వరం, కీళ్ల నొప్పులు వంటివి కనిపిస్తున్నాయి. ఎడిస్ ఈజిప్ట్ అనే దోమల జాతి ద్వారా ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


Share

Related posts

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం

somaraju sharma

Viral: ఆ ప్రాంతంలో కేజి ఆలు 3వేల రూపాలు.. ఎందుకంటే..?

Ram

Cm Kcr: కేసీఆర్ సాబ్.. ఇట్లైతే ఎలా? మాస్క్ ధరించుడు గట్లేనా..!?

Muraliak