18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
న్యూస్

Mahesh Babu : సినిమాల్లోనే కాదు ఆ విషయంలో కూడా మహేష్ కి పోటీకి దిగుతున్న అల్లు అర్జున్..??

Share

Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుతో పోటీపడే హీరోలలో మొదటి వరుసలో ఉండేది అల్లు అర్జున్. వీళ్ళిద్దరూ గత కొంత కాలం నుండి బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అన్నట్టు గా ఒకేసారి సినిమాలు విడుదల చేస్తూ బాక్సాఫీసు వార్ కి తెరలేపుతున్నారు. గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో మహేష్ బాబు సంక్రాంతి పండుగకు విడుదల చేయగా అదే సమయంలో అల్లు అర్జున్ “అల వైకుంఠపురం లో” సినిమా విడుదల చేసి.. మహేష్ మీద పైచేయి సాధించాడు. “అలా వైకుంఠపురం లో” సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అంతకుముందు “స్పైడర్” తో మహేష్ రాగా అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో బరిలోకి దిగడం జరిగింది రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

సినిమాల పరంగా వ్యవహారం ఇలా ఉంటే ఇండస్ట్రీలో యాడ్స్ చేయడం లో ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎక్కువ కంపెనీలకు ఉన్న హీరో మహేష్ బాబు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా ప్రముఖ కంపెనీలకు మహేష్ అంబాసిడర్ గా ఉంటూ యాడ్స్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు యాడ్స్ పరంగా కూడా మహేష్ బాబు కి పోటీ ఇవ్వడానికి అల్లు అర్జున్ రెడీ అయినట్టు సమాచారం. అందుకుగాను ముంబైలో ఓ ప్రముఖ సంస్థతో కమర్షియల్ యాడ్స్ కు సంబంధించి డీల్ సెట్ చేసుకోవడం జరిగిందని, ఇకపై అల్లుఅర్జున్ కూడా కమర్షియల్ యాడ్స్ భారీ స్థాయిలో చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

Energy Drink: ఇది తాగితే నడవలేని వారు కూడా పరిగెత్తారు..!!

bharani jella

“సార్ ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలీకుండా ఇద్దరు అమ్మాయిలు కలిసి” నెల్లూరు పోలీసులకి ఫోన్ వచ్చింది…!

arun kanna

తన గోతిని తానే తీసుకున్న చంద్రబాబు.. సీన్ మొత్తం రివర్స్.. ఇప్పుడేం చేస్తావు బాబు

Varun G