Mahesh Babu: బాహుబలితో మహేష్-జక్కన్న మూవీకి ఉన్న లింక్ ఏంటి..?

Share

Mahesh Babu: అద్భుతమైన సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. ఏ ఇండియన్ మూవీ చేరుకోలేని రేంజ్‌లో బాహుబలిని జక్కన తీసాడు. బాహుబలి సినిమా తరువాత ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రిబుల్ ఆర్ హిట్ అయింది కానీ బాహుబలికి మించిన సినిమాగా పేరు తెచ్చుకోలేకపోయింది. అయితే బాహుబలి అన్ని రికార్డులను మహేష్ బాబు సినిమాతో చేరిపేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

 

Mahesh Babu: చరిత్ర సృష్టించనున్న జక్కన్న-ప్రిన్స్ కాంబో

జక్కన్న మహేష్ బాబు హీరోగా ఒక సినిమా తీయబోతున్నారు. ఆ సినిమా కోసం ఇప్పటినుంచే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ని సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకే రాజమౌళి, కమల్ కణ్ణన్‌తో కలిసి పారిస్‌లోని యూనిట్ ఇమేజ్ అనే అంతర్జాతీయ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థని కలిసినట్లు తెలుస్తోంది. మాక్సిమ్ లారే, రెమి అనే ఈ సంస్థ కో-ఫౌండర్స్‌తో మాట్లాడి విజువల్ ఎఫెక్ట్స్ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సందేహాలను కూడా నివృత్తి చేసుకున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ మహేష్ సినిమా కోసమే అని అందరూ అనుకుంటున్నారు. అయితే రాజమౌళి పారిస్ ట్రిప్ గురించి పేర్కొంటూ ఒక ఫోటో కూడా షేర్ చేశాడు. ఆ ఫొటోలో కనిపించిన ఒక వ్యక్తి ఇప్పుడు ఓ చర్చకి దారి తీశాడు.

బాహుబలితో మహేష్-జక్కన్న మూవీకి ఉన్న లింక్ ఏంటి..?

కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్‌తో కలిసి రాజమౌళి సినిమా చేస్తానని అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అయితే పారిస్‌లో దిగిన ఫొటోలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా కనిపించాడు. దీనితో రాజమౌళితో అతనికి అక్కడ ఏం పని అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫోటో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే రాజమౌళి సినిమాలకి భారీ బడ్జెట్ ఎప్పుడు అవసరం అవుతూనే ఉంటుంది. అందుకే కే.ఎల్ నారాయణ కూడా ఈ సినిమా నిర్మాణ వ్యయం భరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. శోభు యార్లగడ్డ ఒకరే ఈ సినిమాని నిర్మించే ధైర్యం చేయలేదేమో అందుకే కే.ఎల్ నారాయణ కూడా ముందుకు వచ్చారేమో అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago