Subscribe for notification

ఈ సినిమాతో ఒకే తెరపై కనువిందు చేయనున్న రేణు దేశాయ్, మహేష్ బాబు??

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు  గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి  సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నది. అలాగే మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమా లో మహేష్ సిస్టర్ రోల్‌ లో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఈమె ఈ సినిమాలో మహేష్ సిస్టర్‌గా కాకుండా వదినగా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, రేణు దేశాయ్ రోల్ ఈ సినిమాలో చాలా కీలకమైనదట..

ఈ మూవీ స్క్రిప్ట్ ను బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలకి సంబంధించిన స్ట్రాంగ్ కథాంశంతో డైరెక్టర్ పరశురామ్ రెడీ చేశారట. ఇక ఇందులో మహేష్ క్యారెక్టర్ విషయానికి వస్తే తను ఒక వ్యాపారవేత్తగా కనిపించనున్నాడట. అలాగే డైరెక్టర్ పరశురామ్ ఒకపక్కన ఈ సినిమా లో కామెడీకి పెద్ద పీట వేస్తూ మరోపక్క హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్‌గా తీర్చిదిద్దారట. ఈ నేపథ్యంలో సినీ వర్గాల్లో కీలకపాత్రలో  రేణు దేశాయ్ నటించనుందనే లేటెస్ట్ అప్‌డేట్ హాట్ టాపిక్ గా మారింది.

ఇక మహేష్ బాబు ఈ ‘సర్కారు వారి పాట’ మూవీలో హీరోగా నటించడమే గాక చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థలు, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే విడుదలైన ఆసక్తి రేకెత్తించాయి. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.


Share
Naina

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

2 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

3 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

4 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

5 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

6 hours ago