Mahesh Babu: తెలుగు తెర సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు పక్క ఫ్యామిలీ మేన్ అన్న సంగతి అందరికీ తెలిసినదే. తన ప్రొఫెషన్ లో మహేష్ యెంత బిజీగా వున్నా, ఫామిలీ కోసం పక్కాగా సమయం కేటాయిస్తాడు. ఇక తన సినిమా షూటింగ్ ముగిసాక ఫ్యామిలీతో హాలిడేస్ స్పాట్స్ కి వెళుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతను తన అనుభవాలను, అనుభూతులను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటాడు. తాజాగా అలాంటిదే జరిగింది.
Weight Loss: ఈ ఒక్క పండు తీసుకుంటే,మీ పొట్టతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని కూడా మాయం చేస్తుంది!!
Mahesh Babu: సితార చేసిన పని:
పిల్లలు తమలో ప్రతిభను బయటకి కనబరచినపుడు తల్లిదండ్రులకు ఎనలేని ఆనందం. సరిగ్గా అలాంటి ఆనందమే ఇపుడు మహేష్ బాబు పొందుతున్నాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. విషయంలోకి వెళితే, మహేష్ నటిస్తున్న ‘సర్కార్ వారి పాట’ చిత్రం నుండి తాజాగా ‘కళావతి’ సాంగ్ విడుదలై రికార్డు స్థాయిలో వ్యూస్ పొందుతోంది. ఈ పాటకు మహేష్ బాబు కుమార్తె సితార స్టేపులేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Devatha Serial: నేనేమైనా నీ కన్న బిడ్డనా.!? సత్య హాస్పిటల్ కి వెళ్దామంటే రాధ ఏమంది.!?
సితార డాన్స్ పైన మహేష్ బాబు అభిప్రాయం:
మహేష్ తన కూతురి వీడియోని షేర్ చేస్తూ.. ఈ విధంగా కామెంట్ చేసాడు. ‘ఓ మై స్టార్.. నువ్వు నాకన్నా బాగా డాన్స్ చేశావ్’ అంటూ సితారను ఆకాశానికెత్తేసాడు. ఇక ఈ వీడియోను చూసి జనాలు కూడా తెగ మురిసిపోతున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు సితార డాన్స్ పైన ప్రశంసలను కురిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.