Mahesh: సాధారణంగా అబ్బాయిలకు తల్లి వద్ద చనువు ఎక్కువ ఉంటుంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. సూపర్ స్టార్ మహేష్ కూడా తన తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు నాడు ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పుడు తండ్రి కృష్ణ నిత్యం షూటింగ్స్‌లలో బిజీగా ఉండేవారు. ఆ సమయంలో మహేష్‌బాబుకు ఏ లోటు లేకుండా చూసుకున్నది తల్లి మాత్రమే. ఇంకా అమ్మమ్మ దగ్గర కూడా ఆయనకు చనువు ఉన్నా, తల్లి అంటే అంతులేని ప్రేమ కనబరుస్తారు మహేష్. తన తల్లి పుట్టిన రోజు కావడంతో ట్విట్టర్లో ఎంతో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పోస్ట్ వైరల్…!
‘హ్యాపీ బర్త్ డే అమ్మా. నీ దీవెనలు ఎల్లప్పుడూ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఒక్కరోజు సరిపోదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని ట్వీట్ చేశాడు. సూపర్‌స్టార్ కృష్ణకు 1963లోనే ఇందిరతో పెళ్లి జరిగింది. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. తర్వాత నిర్మాతగా స్థిర పడ్డాడు. ఇటీవల ఆయన కాలం చేశాడు. చిన్న కొడుకు మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర నటుడిగా వెలుగొందుతున్నాడు. కృష్ణ-ఇందిర దంపతుల కుమార్తె మంజుల ప్రస్తుతం దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు హీరోగా రాణిస్తున్నాడు. మరో కుమార్తె పద్మావతి భర్త గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
1967లో సహ నటి విజయనిర్మలతో నటించిన కృష్ణ కొంతకాలానికే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇరువురికీ పెళ్లై, పిల్లలున్నా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మల కొడుకు నరేష్, ఇందిర-కృష్ణ సంతానం మహేష్, ప్రియదర్శిని అంతా ఒకటిగానే ఉండేవారు. ఏదేమైనా విజయనిర్మలను పెళ్లి చేసుకోవడంతో కృష్ణ గారిని అప్పట్లో హేళన చేసేవారు. అయినప్పటికీ కుటుంబంపై మొదటి భార్య ఇందిర ఆ ప్రభావం పడనివ్వలేదు. తన తల్లి సంరక్షణలో మహేష్ బాబుతో పాటు పిల్లలందరినీ పెంచి, పెద్ద చేసింది. కుటుంబ సమస్యలెలా ఉన్నా వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంది. అందుకే మహేష్‌కు తన తల్లి అంటే ఎంతో ప్రేమ. అలాగే కుటుంబ సభ్యులతో తన తల్లి పుట్టిన రోజు వేడుకలకు జరుపుకున్నారు మహేష్ బాబు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!