మీకు శ్రీమంతుడు సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హీరో మహేశ్ బాబు తన ఊరిని దత్తత తీసుకొని ఊరిని బాగు చేయడంతో పాటు.. ఊళ్లోని వాళ్లందరిని కూడా దత్తత తీసుకుంటాడు. అందరికీ ఉపాధి కల్పిస్తాడు. అయితే అది సినిమా. సినిమా ఎప్పుడూ నిజం కాదు కదా.. అని మనం అంటుంటాం కానీ.. ఇప్పుడు ఆ సినిమాలోనిదే నిజమయింది. ఆ సినిమాలోని హీరోనే రీల్ లైఫ్ హీరోనే కానీ.. రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు.
మనం మాట్లాడుకునేది సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించే. ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతోమందికి సాయం చేశారు. మరోసారి ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలకు హార్ట్ సర్జరీ చేయించి ప్రాణాలు నిలిపారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇప్పటికే 1020 మంది పిల్లలకు గుండె సంబంధిత సర్జరీలు చేయించారు. తాజాగా మరో ఇద్దిరికి హార్ట్ సర్జరీ చేయించినట్టు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆ చిన్నారులు ప్రస్తుతం కోలుకున్నారని.. వాళ్ల ఫోటోలను నమ్రతా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మరో రెండు హృదయాలు మా కుటుంబంతో కలిశాయి. ఇటీవలే హార్ట్ సర్జరీ చేయించుకున్న ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడిందని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా. మెరుగైన చికిత్స అందించినందుకు ఆంధ్రా ఆసుపత్రులకు ధన్యవాదాలు. ఇంత క్లిష్ట సమయాల్లో కూడా మెరుగైన చికిత్స అందించడం నిజంగా గ్రేట్. ఆ పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు మా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి.. అంటూ నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో ఆ ఇద్దరు చిన్నారుల ఫ్యామిలీల ఫోటోలు పెట్టి పోస్ట్ ను షేర్ చేశారు.
ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు.. మహేశ్ చేసిన ఈ పనికి మహేశ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా తెగ మెచ్చుకుంటున్నారు.
https://www.instagram.com/p/CGeRp8zjVk1/?utm_source=ig_embed
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!