న్యూస్

Mahesh Babu: ఆ పాత్ర కోసం మహేష్ vs రణ్ బీర్ కపూర్

Mahesh Babu vs Ranbirkapoor for that character
Share

Mahesh Babu: రామాయణం, మహాభారతం మీద ఇప్పటికే వివిధ భాషల్లో సినిమాలు వచ్చాయి, సీరియళ్ళు కూడా వచ్చాయి. ఈ గాథలని మరింతగా తీర్చిదిద్ది ప్రేక్షకులకు చూపించాలన్న సంకల్పంతో దర్శకులు చాలా మంది వేచి ఉన్నారు. మహాభారతం పైన కూడా రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. రాజమౌళి కూడా ఒక మెగా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నారు.

 

Mahesh Babu vs Ranbirkapoor for that character

రామాయణం మీద ఒక మెగా మూవీ గురించి కొన్ని ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. నిర్మాత మధు మంతెన, అల్లు అరవింద్ కలిసి ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. దర్శకుడు నితీష్ తివారి ఈ కథను తెరకి ఎక్కించాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ తయారీ పనుల్లో మునిగి ఉన్న చిత్రబృందం ఇంకా నటీనటులను కూడా ఎంపిక చేయలేదు. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పని అయిపోవాలని చూస్తున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో మహేష్ బాబు ని రాముడిగా చూపించాలని మేకర్స్ కోరిక. అన్నారు రాముడి పాత్ర కు మహేష్ బాబు చక్కగా సూట్ అవుతాడని అనుకుంటున్నారు. మహేష్ బాబు వల్ల సౌతిండియాలో ఈ సినిమాకు బాగా క్రేజ్ వస్తుందని, మిగితా పాత్రలకు బాలీవుడ్ ఆర్టిస్టులను పెట్టి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తీసుకురావాలి అని అనుకుంటున్నారు. కానీ మహేష్ బాబు ఇంకా ఈ పాత్ర చేస్తానని ఒప్పుకోలేదు, ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.

రాజమౌళితో సినిమా లైన్ లో ఉన్న మహేష్ బాబు ఆ చిత్రానికి ఇబ్బంది రాకూడదని రామాయణం సినిమాపై విముఖత తోనే ఉన్నాడు. కానీ అల్లు అరవింద్, మధు మంతెన మహేష్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మహేష్ కచ్చితంగా ఈ సినిమా చెయ్యను అని చెప్తే, రణబీర్ కపూర్ ని పెట్టుకుందామని అనుకుంటున్నారు. కానీ రణబీర్ కపూర్ ఇప్పుడు చాలా పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ రణబీర్ ఒప్పుకుంటే రావణుడిగా దక్షిణాది నుంచి మంచి పేరున్న నటుడిని పెట్టుకోవాలి అని భావిస్తున్నారు.


Share

Related posts

నిఘా నేత్రం తెరిచిన కమలనాధులు ! ఎవరిపైనో ?

Yandamuri

Dalita bandhu: ద‌ళిత బంధు త‌ర్వాత‌ నిరుద్యోగ బంధు… తెలంగాణ‌లో కొత్త స్కీం…

sridhar

Big Breaking : చంద్రబాబుకు హైకోర్టులో ఊరట…సీఐడి విచారణపై స్టే

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar