Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి రిలీజ్ అయినా టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక లైకులు, వ్యూస్ సాధించిన సినిమా టీజర్ గా.. అనేక రికార్డులు సృష్టించడం జరిగింది.
ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా సాగుతుంది. ప్రజంట్ షెడ్యూల్ గోవాలో జరుగుతుంది. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా అనుకున్న టయానికి 13వ తారీకు రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ బలంగా ఉంది. దీంతో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తాజాగా.. చిన్నపాటి వీడియో మహేష్ ఫైట్ సీన్ సోషల్ మీడియా లో లీక్ అయింది.
లీక్ అయినా వీడియోలో విలన్ ముందు మహేష్ డైలాగ్ చెబుతున్నాడు. “పోకిరి” సినిమాలో తిన్నామా..?? పడుకున్నామా..?? తెల్లారిందా..?? అనే మాదిరిగా సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ డైలాగ్ ఉంది. తాజాగా లీకైన ఫైట్ సీన్ లో.. మహేష్ ఆ తరహాలోనే డైలాగ్ చెప్పారు. పొద్దున్నే లెగిసి అమ్మ వాకింగ్ చేసాము.. దొబ్బి తిన్నామా.. మళ్లీ రాత్రి గుడ్లు ఆమ్లెట్ వేసుకుని.. కడుపునిండా మెక్కి పడుకున్నమా.. అనే మాదిరిగానే ఉంది అన్న తరహాలో మహేష్ డైలాగ్ చాలా మాస్ యాస్ లో చెప్పటం జరిగింది.