Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త..! ‘సర్కారు వారి పాట’ కు హైలైట్ ఇదే

Share

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధమైన సినిమా ‘సర్కారు వారి పాట’. మహేష్ ప్రీ-లుక్ తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది చిత్ర యూనిట్. జులపాల జుట్టు, చెవికి పోగు, మెడ మీద టాటూ తో మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా పూర్తవుతున్న విషయం కూడా తెలిసిందే. మహేష్ పై సన్నివేశాలు తోనే చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించింది.

 

Mahesh Babu Sarkaru vari Paata movie highlight
Mahesh Babu Sarkaru vari Paata movie highlight

 విశేషమేమిటంటే సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దుబాయ్ కు వెళ్లి మరి బాణీలు వినిపిస్తున్నారు. ఇంతకీ అసలు దుబాయ్ లో ఏముంది? అక్కడ ఎలాంటి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అన్నది మహేష్ అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠ. దుబాయ్ లో అడుగు పెట్టగానే అక్కడి సెట్ ఫోటో ని తన మహేష్ ఇస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. ఇంకేముంది అభిమానుల దెబ్బకు ఆ ఫోటో కాస్తా వైరల్ అయిపోయింది. 

తాజాగా షార్జా మెలిహా పురావస్తు కేంద్రం పరిసరాల్లో చిత్రీకరణ సాగుతుందని టీం తెలిపింది. ఇక ఈ సినిమా కోసం ఒక పెద్ద కార్ చేజ్ ప్లాన్ చేసినట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. పూర్తి ఎడారిలో ఖరీదైన కార్లను తెప్పించి ఒక మంచి యాక్షన్ సన్నివేశం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దుబాయిలోని ప్రసిద్ధమైన నగరాల్లోని కొన్ని అతి సుందర ఖరీదైన భవనాల్లో కూడా ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. దీంతో థమన్ కూడా తన ఉత్సుకత ఆపుకోలేక ఒక అద్భుతమైన ఫోటో షేర్ చేశాడు. 

మొత్తం మూసేశాం…!! మన సూపర్ స్టార్ నటిస్తున్న షూటింగ్ లో ఉన్నాను. నాకు ‘దూకుడు’ రోజులు గుర్తొస్తున్నాయి అని ఒక వ్యాఖ్యను ఫోటో కి జోడించడు థమన్. దూకుడు సినిమా ఎంత పెద్ద హిట్టో… ఆ ఆల్బమ్ ఎంత సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం పురావస్తు సందర్శకులకు కేంద్రంగా ఉండే ఏరియా లో చిత్రీకరణ జరుగుతుండడం ఖరీదైన కార్లను మంచి యాక్షన్ సన్నివేశం కోసం తీసుకుని వస్తూ ఉండడం చూసి మహేష్ అభిమానుల్లో ఆనందం ఆగట్లేదు. ఈ చిత్రం పైన అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.


Share

Related posts

AP High court: జగన్ ప్రభుత్వానికి మరో పెద్ద ఎదురుదెబ్బ..! ఆ ఐఏఎస్ చట్రంలో ఇరుక్కున్న జగన్..!!

Srinivas Manem

బిగ్ బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరిగితే రాష్ట్రపతి పాలన??

somaraju sharma

కరోనా పరీక్షలు:వ్యాప్తి అరికట్టేందుకు ముందుగా ఎవరికి చేయాలంటే..?

somaraju sharma