Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సరదాగా సన్నిహితులతో ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఒకసారి ఆయనతో కనెక్ట్ అయితే చాలా ఫ్రీగా ఉంటే మాత్రం మహేష్.. సెటైర్లతో బాగా నవ్విస్తారు అని ఏడిపిస్తారు అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇక ఇదే తరుణంలో తన దగ్గర పనిచేసే వారి గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు అని చెబుతారు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలో వచ్చిన నాటి నుండి మేకప్ మ్యాన్ గా ఉన్న వ్యక్తి పట్టాభి. అయితే ఇటీవల ఆయన పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ లో మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మాత్రమే కాక.. ఇప్పటివరకు నాకు తెలిసిన వారిలో ది బెస్ట్ మేకప్ మాన్ మీరే అంటూ… మీ కెరియర్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానని, అదే రీతిలో మీ పై గౌరవం ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుందని మహేష్ బాబు తన పర్సనల్ మేకప్ మాన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ… సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆయన తో దిగిన ఫోటోలను మహేష్ షేర్ చేయడం జరిగింది.
Read more: Mahesh babu: విశాఖపట్టణంలో ఫుల్ బిజీ కాబోతున్న మహేష్ బాబు..!!
దీంతో మహేష్ బాబు అభిమానులు పట్టాభి కి భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. పట్టాభి కూడా ఒకానొక సందర్భంలో మహేష్ గురించి మాట్లాడుతూ ఆయన ఎంతగానో గౌరవిస్తారని తనకు పర్సనల్గా అనేక విషయాలలో సహాయం చేయడం మాత్రమే కాక కూతురు పేరు పెట్టడం కోసం మీ ఇంటికి రావడం జరిగిందని అదే రీతిలో తన కొడుకు డాక్టర్ గా చదవటం అనేది కేవలం మహేష్ బాబు చేసిన ఆర్థిక సహాయం వల్లే అంటూ పట్టాభి చెప్పుకొచ్చారు. చాలావరకు సెలబ్రిటీలు టాప్ డైరెక్టర్లకు నిర్మాతలకు అదేరీతిలో తోటి నటీనటులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతారు కానీ మహేష్ తన దగ్గర పనిచేసే వారిని కూడా మంచి గౌరవం ఇచ్చే రీతిలో పోస్ట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!