న్యూస్ సినిమా

Mahesh Babu: ఫ్యాన్స్ కి బర్తడే ట్రీట్ భారీఎత్తున ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు..!!

Share

Mahesh Babu: మహేష్ ప్రతి ఏడాది తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు తన కొత్త సినిమాకి సంబంధించి ఫోటో లేదా వీడియో రిలీజ్ చేయటం సెంటిమెంట్. గత ఏడాది మే 31 వ తారీకు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నట్లు టైటిల్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను అలరించారు. అయితే ఈ ఏడాది మే 31 వ తారీకు టైం లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో… ఆటో ఎక్కువ మరణాలు సంభవించడం మాత్రమే కాక చాలా వరకు పరిస్థితులు హృదయవిదారకంగా ఉండటంతో.. మహేష్ “సర్కారు వారి పాట” సినిమా కి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వలేదు.

Sarkaru Vaari Paata car chase sequence In Dubai - tollywood

ఆ సమయంలో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ సారి తన పుట్టినరోజు నాడు అభిమానులకు బిగ్ ట్రీట్ ప్లాన్ చేయడం జరిగిందట. మేటర్ లోకి వెళితే “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో గ్లింప్స్.. అదే రీతిలో త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు.. “సర్కారు వారి పాట” టైటిల్ అధికారికంగా ప్రకటించిన టైములో పోస్టర్ లో డిఫరెంట్ మేకోవర్ తో ఏ విధంగా అయితే.. అభిమానులను సర్ప్రైజ్ చేయడం జరిగింది అదే రీతిలో వీడియో తో… కూడా అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇచ్చే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు సమాచారం.

Read More: Mahesh Babu: పాన్ ఇండియా సినిమా చేయకపోయినా నెంబర్ వన్ లో మహేష్ బాబు..!!

ఇటీవలే సర్కారు వారి పాట సినిమా కి సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ తక్కువ టైమ్ లో కంప్లీట్ అవ్వాలని డైరెక్టర్ కి మహేష్.. తెలియజేసినట్లు ఇంకా షూటింగ్ ఆలస్యం కాకూడదని.. గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. దాదాపు మహమ్మారి వైరస్ కారణంగా రెండు సంవత్సరాల పాటు సినిమాలు రాని పరిస్థితి ఉండటంతో ఇక నుండి షూటింగ్ విషయంలో సినిమాలు చాలా త్వరగా కంప్లీట్ చేయాలని మహేష్ చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట.

 


Share

Related posts

Vishakapatanam: ఏపీ రాజధానిగా విశాఖపట్టణాని గుర్తించిన కేంద్రం..!!

sekhar

PowerStar Pawan Kalyan Latest Photos

Gallery Desk

మాజీ మేజర్ తప్పుడు వీడియో!

Kamesh