Mahesh : టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పటినుండో మహేష్ Mahesh వర్సెస్ బన్నీ పోటీ జరుగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నటించిన చివరి సినిమాలు “అలా వైకుంఠపురంలో” , “సరిలేరు నీకెవ్వరు” రెండూ కూడా గత ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో థియేటర్ల కోసం రెండు సినిమాల నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు. చివరాకరికి .. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు చొరవ తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అంతే కాకుండా ఈ సినిమా రాకముందు “స్పైడర్” వర్సెస్ “నాపేరు సూర్య” పోటీపడి రిలీజ్ అవ్వగా రెండు బోల్తా పడటం జరిగింది. ఈ విధంగా ఒకరితో ఒకరు పోటీ పడి వాతావరణం ఉన్న తరుణంలో తాజాగా ఇద్దరు అభిమానులు ట్విట్టర్ సాక్షిగా ఒకరిపై ఒకరు చెలరేగిపోయారు.
అసలు విషయానికి వస్తే, మహేశ్ బాబును ‘డ్రగ్స్ క్వీన్’గానూ, అల్లు అర్జున్ ను ‘కేరెక్టర్ లెస్ హీరోయిన్’గానూ అభివర్ణిస్తూ ఒక హీరో అభిమానులు మరొకరిపై వికృతచేష్టలు పాల్పడుతూ సోషల్ మీడియాలో పెద్దవార్ కొనసాగిస్తున్నారు. అసలు ఈ వారు ఎందుకు చోటు చేసుకున్న తెలియదుగానీ .. ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇండస్ట్రీలో హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ ఈ విధంగా అభిమానుల మధ్య ఒకరిపై మరొకరు తిట్టుకునే విధంగా పరిస్థితులు ఉంటే .. చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తాజా వార్త పై సోషల్ మీడియాలో నార్మల్ నెటిజన్లు మండిపడుతున్నారు. అభిమానం ఉండాలి గాని ఈ విధంగా ఒకరిని విమర్శిస్తూ మరొకరు పైశాచిక ఆనందం పొందటం దారుణమని .. ఇది కావాలనే కొంతమంది ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవ పెట్టడానికి చేస్తున్న ప్రయోగాలు అంటూ ఆరోపిస్తున్నారు.