Prabhas Mahesh: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా బీభత్సంగా ఉన్న సంగతి తెలిసిందే. మనోడు క్రేజ్ ముందు బాలీవుడ్ హీరోలు కూడా పోటీ పడలేని పరిస్థితి. అంతగా దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో “బాహుబలి” విజయంతో ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. దీంతో ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరొందిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తెగ వైరల్ అవుతున్నారు. దీంతో ప్రభాస్ పెళ్లి వార్త ఒకప్పుడు తెలుగులో చర్చనీయాంశం కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా.. హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు.
ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఎటువంటి వార్త అయినా గాని అంతే ఎగబడి చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలు ఇండస్ట్రీలో ఏ హీరోకి వచ్చి ఉండవు. అంతలా ప్రభాస్ పెళ్లి వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్‌తో అని అప్పట్లో అనుష్కతో ఇంకా అంత సెట్ అయిపోయిందని.. ఇలా రకరకాల వార్తలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ కృతి సనన్… ప్రభాస్ తో పెళ్లికి రెడీ అంటూ ప్రముఖ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
విషయంలోకి వెళితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిసనన్.. ఎవరితో డేట్, ఎవరితో పెళ్లి.. ఎవరిని ఫ్లర్ట్ చేస్తారు.. అంటూ యాంకర్ టైగర్ ష్రాఫ్, ప్రభాస్, కార్తీక్ ఆర్యన్ పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కృతి సనన్ ప్రభాస్ తో పెళ్లి, టైగర్ షరఫ్ తో డేట్… కార్తిక్ ఆర్యన్ ఫ్లాట్ చేస్తా అంటూ మనసులో మాట చెప్పేసింది. కృతిసనన్ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో వన్ సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తో “ఆదిపురుష్” సినిమాలో ప్రభాస్ పక్కన సీత గా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో పెళ్లి అని కృతిసనన్ నిర్మొహమాటంగా ఇంటర్వ్యూల్లో తెలపడంతో ఈ వార్త ఆలిండియా లెవల్ లో సెన్సేషనల్ గా మారింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!