న్యూస్ సినిమా

ఆ సినిమాతో పోటీకి రెడీ అవుతున్న మహేష్ “సర్కారు వారి పాట”..!!

Share

మహేష్ “సర్కారు వారి పాట” సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరగనుంది. తాజాగా మహేష్ కుటుంబ సమేతంగా దుబాయ్ లో జరగబోయే ఫస్ట్ షెడ్యూల్ కోసం కుటుంబ సమేతంగా వెళ్లినట్లు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ టైం మహేష్ బాబు చాలా డిఫరెంట్ మేకోవర్ తరహాలో ఒంటి మీద టాటూ వేయించుకోవడం మాత్రమే కాక గుబురు జుట్టు పెంచుకోవడం జరిగింది.

What Is The Situation Of That Big films Pushpa and Sarkaru Vaari Paata  Shootings - Chitrambhalare English | DailyHuntఇదిలా ఉంటే సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫస్ట్ టైం చేయటంతో సినిమాపై సామాన్య ప్రేక్షకులకు కూడా ఆసక్తి నెలకొంది. “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత వంశీ పైడిపల్లి తో సినిమా అని మహేష్ అభిమానులు అనుకోగా ఆ ప్రాజెక్టు పక్కన పెట్టడం.. వెంటనే గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ చెప్పినా సినిమా ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి.

 

అయితే ఇంతలోనే కరోనా వైరస్ రావటంతో లాక్‌డౌన్‌ దెబ్బకు సినిమా షూటింగులు మొన్నటి వరకు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో మొదలు పెట్టనున్న తరుణంలో..నాన్ స్టాప్ గా కంప్లీట్ చేసి ఎట్టిపరిస్థితిలో వచ్చే దసరా సందర్భంగా విడుదల చేయాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరో సారి మహేష్ బాబు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పోటీకి దిగుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ స్పైడర్, నాపేరు సూర్య తో పోటీపడగా తర్వాత సరిలేరు నీకెవ్వరు తో అల వైకుంఠ పురం లో తలపడ్డారు. కాగా ఈసారి సర్కారు వారి పాట, పుష్ప సినిమాతో బాక్సాఫీసు దగ్గర నువ్వా నేనా అన్నట్టుగా పోటీకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Height Growth: హైట్ పెరగాలి అనుకుంటున్నారా..!! అయితే ఇవి తింటున్నారా..!!

bharani jella

పవన్ కళ్యాణ్ సినిమా చివరి కొచ్చేసిందా…??

sekhar

RRR: రాజమౌళి ఒక్కడే.. బాలీవుడ్ స్టార్ క్రేజీ కామెంట్స్ వైరల్..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar