Mahesh : హీరోలు చాల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అందరికి తెలుసు.. వారు ఉండటానికి రాజమందిరం లాంటి ఇల్లు, విహరించడానికి స్వర్గధామం లాంటి వాహనాలు ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో హీరోలు కార్ వ్యాన్ లు ఎక్కువగా వాడుతున్నారు. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా కార్ వ్యాన్ ను తయారు చేయించుకున్న విషయం అందరిని ఆకట్టుకుంది..! తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యాధునిక ఫీచర్స్ తో కార్ వ్యాన్ ను తయారు చేయించుకున్నారు..!! ఈ కార్ వ్యాన్ ధర 10కోట్లు పై మాటే..! ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..
ఈ కార్ వ్యాన్ ను ముంబై బేస్డ్ కంపెనీ రూపొందించింది. ఇందులో చాలా లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కార్ వ్యాన్ మహేష్ లక్కీ నెంబర్ 4005 తో రిజిస్టర్ చేసారు. మహేష్ బాబు ఇక పై జరిగే అన్ని షూటింగ్ లకు ఈ కార్ వ్యాన్ ఉపయోగించనున్నారు. దీనిలో రెండు బెడ్ రూమ్ లు, హోమ్ థియేటర్ , స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఐ ప్యాడ్ కంట్రోల్ సిస్టం కూడా ఉంది. ఈ కార్ వ్యాన్ చూడటానికి అద్భుతంగా, ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది.. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.