RRR Trailar: బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న “RRR” సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో బాహుబలి కంటే భారీ స్థాయిలో విజయం సాధించే దిశగా రాజమౌళి “RRR” లో.. ప్రతి సన్నివేశం విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ మొదలైన నాటి నుండి టాక్ నడుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా “RRR” ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది.
ట్రైలర్ లో ఎన్టీఆర్.. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న మాదిరిగా రాజమౌళి చూపించారు. ప్రతి షాట్ ప్రేక్షకులను ఎంతో మైమరిపించే రీతిలో RRR ట్రైలర్ ఉందని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ రేంజ్ లో రికార్డులు పగలగొడతా కొత్త రికార్డులు సృష్టిస్తూ RRR దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో “RRR” సినిమా ట్రైలర్ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో ట్విట్టర్ లో కామెంట్లు పెట్టారు. ట్రైలర్ లో ప్రతి సన్నివేశం.. అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. కళ్లు చెదిరే రీతిలో మైమరిపించే విధంగా షాట్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. కథ నడిపించే విధానం అద్భుతంగా ఉందని ప్రతి సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకున్నెలా…గోస్ బోంప్స్ వచ్చాయని స్పష్టం చేశాడు మహేష్.
దీంతో మహేష్ చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారయి. RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా అని ప్రకటించడం జరిగింది. RRR వచ్చే నెల విడుదల అవటానికి సిద్ధంగా ఉంది దీనితో రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు.. డిస్కషన్లు అభిమానులలో స్టార్ట్ అయ్యాయి. “బాహుబలి” సూపర్ హిట్ ఇప్పుడు “RRR” కూడా ఆ దిశగా వెళుతూ ఉండటంతో… మహేష్- రాజమౌళి మూవీ ఏ విధంగా ఉంటుందో.. అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.